కొడుకు కోసం 200 కోట్లు పెడతావా బాబూ?

కొడుకు కోసం  200 కోట్లు పెడతావా బాబూ?

సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఒకప్పుడు రెండు రకాల సినిమాలొచ్చేవి. దాని వ్యవస్థాపకుడు డి.రామానాయుడు చిన్న-మీడియం రేంజి హీరోలతో లో బడ్జెట్ సినిమాలు చేసేవారు. మరోవైపు సురేష్ మాత్రం పెద్ద స్థాయి సినిమాలు నిర్మించేవారు. ఈ ఒరవడి చాలా కాలం కొనసాగింది. కానీ తర్వాత కథ మారిపోయింది. రామానాయుడు సినిమాల నిర్మాణం మానేశారు. ఆపై ఆయన అనారోగ్యంతో మరణించారు. దాని కంటే ముందే సురేష్ భారీ సినిమాల నిర్మాణం ఆపేశారు.

అసలు ఒక దశలో సురేష్ ప్రొడక్షన్ప్‌లో సినిమాల నిర్మాణమే ఆగిపోయే పరిస్థితి కనిపించింది. కానీ తర్వాత సురేష్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేరే వాళ్లతో కలిసి చాలా తక్కువ పెట్టుబడిలో సినిమాలు నిర్మించడం.. ఇంకెవరో నిర్మించిన చిన్న సినిమాల్ని టేకప్ చేసి వాటిని తమ బేనర్లో రిలీజ్ చేయడం ద్వారా వాటా తీసుకోవడం చేశారు.

గత ఐదారేళ్లలో సురేష్ బాబు కోటికి మించి ఏ సినిమా మీదా పెట్టుబడి పెట్టింది లేదంటారు. ఇలా అసలు డబ్బులే పెద్దగా బయటికి తీయకుండా ప్రొడక్షన్ కొనసాగిస్తున్నారు సురేష్ బాబు. సురేష్ బాబును మెప్పించి ఓ మోస్తరు బడ్జెట్ సినిమా తీయడమే చాలా కష్టం అన్న అభిప్రాయం సినీ జనాల్లో వచ్చేసింది.

ఐతే ఇలాంటి నిర్మాత ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అదే.. హిరణ్యకశ్యప. గుణేశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. సురేష్ సైతం ఈ సినిమా మీద వర్క్ జరుగుతున్నట్లు సంకేతాలిచ్చాడు. కానీ దీని బడ్జెట్ రూ.200 కోట్లన్న వార్తలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

అలాంటిది ఏకంగా రూ.200 కోట్లు పెట్టి నిజంగా సినిమా తీస్తారా అని ఇండస్ట్రీ జనాలు జోకులు పేలుస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రానా ఇమేజ్ ఎంత పెరిగినా.. 'హిరణ్య కశ్యప'ను ఎన్ని భాషల్లో తీసి రిలీజ్ చేసినా.. మరీ ఈ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం మాత్రం చాలా కష్టం. మరి 'హిరణ్యకశ్యప' మీద నిజంగా ఇంత బడ్జెట్ పెడతారేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English