ఆ బట్టల్లో కత్రినాను కూర్చోమంటే ఎలా?

ఆ బట్టల్లో కత్రినాను కూర్చోమంటే ఎలా?

హీరోయిన్లు ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళకు ఎంత మైలేజీ వస్తుందో.. ఆ బట్టలు కాస్త తేడాకొట్టేసి ఏదన్నా వాడ్రోబ్ మాల్ ఫంక్షన్ అయ్యిందంటే మాత్రం.. అంతే బ్యాడ్ నేమ్ కూడా వస్తుంటుంది. ఈ విషయంలో బాలీవుడ్ భామలు భలే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పొదుపుగా బయటకు వచ్చినప్పుడు మాత్రం.. ఈ భామలు జాగ్రత్తలు తీసుకోవడంలో నిష్ణాతులు అయిపోయారు. ఇప్పుడు సెక్సిణి కత్రినా కైఫ్‌ విషయానికే వస్తే.. అమ్మడు అసలు తనకు కంఫర్టబుల్ గా లేకపోతే మాత్రం, ఏ పనిచేయడానికైనా నిర్మొహమాటంగా నో చెబుతోంది.

షారూఖ్ ఖాన్ 'జీరో' సినిమాలో హుస్న్ పర్చామ్ అంటూ ఒక పాటలో మత్తెక్కించే హొయలను ఒలకబోసింది కత్రినా కైఫ్‌. ఆ కైపెక్కించే అందాల గురించి అందరికీ తెలియాలని.. ఈ పాట కోసం ఒక లాంఛింగ్ ఈవెంట్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మడు ఓ రెండు స్టెప్పులు కూడా వేసిందిలే. అయితే పాటలో ఎంత హాటుగా కనిపించిందో షుమారు అదే బట్టల్లో ప్రోగ్రామ్ కు కూడా విచ్చేసింది. కాని అక్కడ కాస్త ఎత్తుగా ఉన్న సీట్లో కూర్చమనేసరికి.. అక్కడ కూర్చుంటే వెంటనే ఫోటోగ్రాఫర్లు ఎక్కడ క్లిక్ అనిపిస్తారో తెలుసు కాబట్టి.. వెంటనే నో చెప్పేసింది. తనతో పాటు ఏకంగా మొత్తం టీమును 30 నిమిషాల పాటు నుంచోబెట్టి ఈవెంట్ నడిపించింది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English