చైతన్యకి అత్త దొరికేసింది

చైతన్యకి అత్త దొరికేసింది

నాగచైతన్య మలి చిత్రంలో మేనమామ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'వెంకీ మామ' అనే టైటిల్‌ ఖరారు చేసిన విషయమూ విదితమే. 'జై లవకుశ' దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో చైతన్య సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుంది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' తర్వాత చైతో రకుల్‌ నటించే చిత్రమిదే. ఇకపోతే ఇందులో వెంకీకి జోడీ ఎవరనే దాని కోసం బాగానే అన్వేషించారు.

నయనతార కోసం ట్రై చేసారు కానీ ఆమె డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో శ్రియా శరన్‌ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్‌ హీరోల కోసం పరిశీలించే పేర్లలో శ్రియ ఇప్పటికీ ముందు వరుసలో వుంటుందని దీంతో మరోసారి రుజువయింది. ప్రస్తుతం బ్యాడ్‌ ఫేజ్‌లో వున్న నాగచైతన్య కెరియర్‌కి ఈ చిత్రం చాలా కీలకమవుతుంది. నాగార్జునతో నాగచైతన్య చేసిన మల్టీస్టారర్‌ మనం ఎంత పెద్ద హిట్‌ అయిందో మేనమామతో కలిసి చేసే ఈ చిత్రం కూడా అలాగే తన పరాజయాలకి బ్రేక్‌ వేస్తుందని యువ అక్కినేని హీరో భావిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English