2.0 ఇంకో 24 కోట్లు కావాలి

2.0 ఇంకో 24 కోట్లు కావాలి

2.0 ఫైనల్ రిజల్ట్ ఏంటన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సినిమా పడుతూ లేస్తూ సాగుతోంది. ‘2.0’ తెలుగు వెర్షన్ హక్కుల్ని దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్ కలిసి ఏకంగా రూ.72 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇది డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక రేటు కంటే రెట్టింపు కావడం విశేషం. ఐతే ‘2.0’ మీద ఉన్న అంచనాల దృష్ట్యా రికవరీ కష్టమేం కాదనుకున్నారు. కానీ అదెంత కష్టమైన టాస్కో ఇప్పుడు అర్థమవుతోంది.

రెండో వీకెండ్ అయ్యాక ఈ చిత్రం 65 శాతం పెట్టుబడే రికవర్ చేసింది. రెండో వీకెండ్లో కూడా సత్తా చాటినప్పటికీ ఈ చిత్రం ఇంకా 50 కోట్ల షేర్ మార్కును టచ్ చేయలేదు. 11 రోజుల్లో ఈ సినిమా రూ. కోట్ల షేర్ సాధించింది. నైజాంలో అదరగొట్టిన ‘2.0’ రూ.21.62 కోట్ల షేర్ సాధించడం విశేషం. మిగతా ఏరియాల్లో ఈ స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ‘2.0’ ఇంకా రూ.24 కోట్ల షేర్ రాబట్టాలి. కానీ అది చాలా కష్టమైన టాస్కే అనిపిస్తోంది.

ఏరియాల వారీగా 11 రోజుల్లో ‘2.0’ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..
నైజాం- రూ.21.62 కోట్లు
సీడెడ్- రూ.6.75  కోట్లు
వైజాగ్- రూ.5.8 కోట్లు
తూర్పు గోదావరి- రూ.3.43 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.2.37 కోట్లు
కృష్ణా- రూ.2.75 కోట్లు
గుంటూరు- రూ.3.33 కోట్లు
నెల్లూరు- రూ.1.75 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.48 కోట్లు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English