దిల్‌ రాజు అతడినే దింపొచ్చుగా?

దిల్‌ రాజు అతడినే దింపొచ్చుగా?

96ని ఎలాగైనా రీమేక్‌ చేయాలని చూస్తోన్న దిల్‌ రాజుకి ఇంతవరకు హీరో దొరకలేదు. గోపిచంద్‌తో క్లాస్‌ సినిమా చేయిస్తే బాగుంటుందనే ఆలోచనతో అతడిని సంప్రదించారట కానీ అసలే పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న గోపిచంద్‌ ఇప్పుడు ఇమేజ్‌తో ప్రయోగం చేసేందుకు సిద్ధంగా లేడట. గోపిచంద్‌ వేరే సినిమాలు ఓకే చేస్తూ పోవడం చూస్తేనే 96పై తనకి ఆసక్తి లేదనేది అర్థమవుతోంది. దీంతో ఈ రీమేక్‌కి హీరో వేట మళ్లీ మొదటికి వచ్చింది. అయినా దిల్‌ రాజుకి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనే ఉద్దేశం వుంటే తమిళ వెర్షన్‌లో నటించిన విజయ్‌ సేతుపతినే ఇక్కడ పరిచయం చేయవచ్చుగా.

ఇప్పటికే పలు అనువాద చిత్రాలతో అతను మనవాళ్లకి కాస్త పరిచయం అయ్యాడు. చిరంజీవి 'సైరా'లో ఒక కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. 96కి విజయ్‌ సేతుపతికి రీప్లేస్‌మెంట్‌ దొరకడం లేదన్నపుడు అతడితోనే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసి మళ్లీ తీయవచ్చుగా? ఎలాగో తెలుగునాట మార్కెట్‌ పెంచుకోవాలనే కోరిక విజయ్‌ సేతుపతికి వుంది కనుక దిల్‌ రాజు ఈ ప్రపోజల్‌ తీసుకెళ్లినా కాదనడు. లేదా అసలు రీమేకే వద్దనుకుని అనువదించి బాగా ప్రమోట్‌ చేసినా కానీ ఈ సినిమాకి వచ్చిన బజ్‌కి ఇక్కడ ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English