హృదయ కాలేయం దర్శకుడి పోస్ట్ వైరల్

హృదయ కాలేయం దర్శకుడి పోస్ట్ వైరల్

‘హృదయ కాలేయం’ లాంటి చిత్రమైన సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించాడు సాయి రాజేష్ అలియాస్ స్టీవెన్ శంకర్. దీని తర్వాత అతను సంపూర్ణేష్ బాబునే హీరోగా పెట్టి ‘కొబ్బరిమట్ట’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్న సాయిరాజేష్.. మామూలుగా ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. వివిధ అంశాలపై ఆసక్తికర పోస్టులు పెడుతుంటాడు. తాజాగా అతను పెట్టిన ఒక పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. తనను ఆడియో వేడుకలకు పిలవొద్దంటూ అతను ఈ పోస్ట్ పెట్టడం విశేషం. ఆడియో వేడుకలకు వెళ్లి తాను పడే ఇబ్బందుల్ని అతను చాలా సరదాగా వివరించాడు.
సాయిరాజేష్‌ను అభిమానించే చాలామంది ఆడియో వేడుకలకు పిలుస్తుంటారట. నేనెందుకు.. ఎవరికి తెలుసు అంటే అదేమీ లేదు.. నీ రేంజే వేరు అన్నట్లుగా తీసుకెళ్తారట.

తీరా అక్కడికి వెళ్లాక హీరోకు పరిచయం చేస్తే ఎవరితను అన్నట్లు చూస్తాడట. హృదయ కాలేయం డైరెక్టర్ అని చెప్పి.. ఆ తర్వాత తీసుకెళ్లి తొలి వరుసలో కూర్చోబెడతాడట. ఆపై బౌన్సర్లు తీసుకెళ్లి రెండో వరుసలో కూర్చోబెతడాడట. ఆ తర్వాత మరెవరో వచ్చి మూడో వరుసకు పంపిస్తారట. అంతలోనే తెలిసిన ఇంకొకడు వచ్చి మీరేంటి వెనుక కూర్చున్నారు అంటూ ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టబోతుండగా.. మూడో వరుసలో సీటును ఇంకెవరో ఆక్రమిస్తారట. చివరికి ఏం చేయాలో అర్థం కాక చిత్ర బృందం పక్కన నిలుచుని డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ.. మూగగా రోదిస్తూ బయటపడుతుంటానని సాయిరాజేష్ వెల్లడించాడు. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని తనను ఎవరూ ఆడియో వేడుకలకు పిలవొద్దని ఫన్నీగా విజ్ఞప్తి చేశాడు సాయిరాజేష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English