తెలంగాణలో చరిత్ర సృష్టించిన 2.0

తెలంగాణలో చరిత్ర సృష్టించిన 2.0

2.0పై పెట్టిన రేట్లకి ఎక్కడ గిట్టుబాటు అయినా లేకున్నా కానీ బాలీవుడ్‌లో, తెలంగాణలో మాత్రం ఈ చిత్రం సక్సెస్‌ అయింది. మొదట్నుంచి ఉత్తరాదితో పాటు నైజాంలోనే 2.0 చాలా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఏ దశలోను నైజాం వసూళ్లలో తగ్గుదల కనిపించలేదు. రెండవ వారంలో కూడా అద్భుతమైన వసూళ్లు తెచ్చుకుంటోంది.

పది రోజుల్లోనే ఇరవై కోట్ల మార్కు దాటి తెలంగాణలో ఇరవై కోట్ల షేర్‌ తెచ్చుకున్న తొలి అనువాద చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఆదివారంతో  ఇరవై రెండు కోట్ల వరకు షేర్‌ తెచ్చుకున్న ఈ చిత్రం వచ్చే రెండు, మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుంది. హిందీలో కూడా నూట యాభై కోట్ల నెట్‌ వసూళ్లని దాటి రెండు వందల కోట్ల నెట్‌ వసూళ్లు తెచ్చుకునే దిశగా 2.0 సాగుతోంది.

కేదార్‌నాథ్‌ చిత్రం వల్ల 2.0 సెకండ్‌ వీకెండ్‌ హిందీ వసూళ్లపై కాస్త ప్రభావం పడింది కానీ ఇప్పటికీ అక్కడ స్టడీగా రన్‌ అవుతోంది. బాహుబలి 2 తర్వాత హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ అనువాద చిత్రమిదే. మరోవైపు యుఎస్‌లో కూడా అయిదు మిలియన్‌ డాలర్ల వసూళ్లకి సమీపంలో వున్న ఈ చిత్రం భారీగా పెట్టుకున్న అంచనాలని అయితే అందుకోలేదు కానీ ఈ మూడు ఏరియాల్లోను సంచలనాలని అయితే నమోదు చేయగలిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English