పవన్‌కళ్యాణ్‌ తరఫున ఎందుకు వకాల్తా?

పవన్‌కళ్యాణ్‌ తరఫున ఎందుకు వకాల్తా?

పవన్‌కళ్యాణ్‌పై శ్రీరెడ్డి ఉదంతం సాక్షిగా జరిగిన వ్యక్తిగత దూషణ సమయంలో పవన్‌ కంటే ముందుగా అల్లు అరవింద్‌, నాగబాబు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పవన్‌ని అనరాని మాట అనడం, అది తన మాతృమూర్తి గౌరవానికి భంగం కలిగించే మాట కావడంతో మెగా ఫ్యామిలీ స్పందించినట్టు అనిపించింది.

అంతే తప్ప పవన్‌ రాజకీయ వ్యవహారాల గురించి కానీ, అతని పార్టీ గురించి కూడా మెగా ఫ్యామిలీలో ఎవరూ మాట్లాడిందే లేదు. పవన్‌ కూడా తన కుటుంబం నుంచి ఎవరినీ పిలవలేదు. తనకున్న పరిజ్ఞానంతో, తన చుట్టూ వున్న రాజకీయ విశ్లేషకుల ఆలోచనలతో ముందుకి వెళుతున్నాడు. అయితే నాగబాబు తమ్ముడి తరఫున వకాల్తా తీసుకుని 'బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు' అనడం రచ్చకెక్కింది. సోషల్‌ మీడియాలో నందమూరి అభిమానులు చిందులు తొక్కుతున్నారు.

రేపో మాపో ఈ విషయాన్ని నేరుగా బాలకృష్ణనే మీడియా అడుగుతుంది. అప్పుడు ఆయన స్పందన ఎలా వుంటుందో చూడాలి. ఇదిలావుంటే పవన్‌ తరఫున చాలా విషయాలని నాగబాబు మాట్లాడడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోయినా అవసరమయితే గ్రౌండ్‌ వర్క్‌ చేసిపెడతాననడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని బట్టి పవన్‌ రమ్మనాలే కానీ మెగా ఫ్యామిలీ జనసేన కోసం ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎక్కడ ప్రజారాజ్యం ఛాయలు దీనిపై పడి ఈ పార్టీని కూడా జనం తేలిగ్గా తీసుకుంటారోననే భయం పవన్‌కి వున్నట్టుంది. అందుకే తన వెనుక ఇంకా చాలా స్టార్‌ ఎట్రాక్షన్‌ వున్నా కానీ పవన్‌ ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి స్టెప్‌ వేయలేదనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English