రాంగ్‌ ట్రాక్‌లో కీర్తి సురేష్‌?

రాంగ్‌ ట్రాక్‌లో కీర్తి సురేష్‌?

ఏ హీరోయిన్‌కి అయినా కెరియర్‌ మలుపు తిప్పే చిత్రం వచ్చినపుడు, అది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అయినపుడు ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై కన్‌ఫ్యూజన్‌ నెలకొనడం ఖాయం. అయితే ఇది హీరో డామినేటెడ్‌ ఇండస్ట్రీ అని, అలాంటి అవకాశాలు అరుదుగా మాత్రమే వస్తాయని గుర్తించిన హీరోయిన్లే అలా వచ్చిన క్రేజ్‌ని కాపాడుకుని మరో రేంజ్‌కి వెళ్లగలిగారు. విజయశాంతి అయినా, సౌందర్య అయినా, అనుష్క అయినా తమంతట తాముగా సినిమాని నడిపించే సామర్ధ్యం వున్నదని తెలిసినపుడు కూడా గ్లామర్‌ పాత్రలని, హీరో ప్రధాన చిత్రాలని వదిలిపెట్టలేదు.

మరీ ఇంకా అనుభవం రాకుండానే మహానటిలాంటి సినిమా చేసేయడం వల్లనేమో కీర్తి సురేష్‌ అదోరకం మాయలో పడిపోయింది. ఇకపై చేస్తే అలాంటి సినిమాలే చేయాలన్నట్టు వచ్చిన అవకాశాలు అన్నిటినీ వదిలేసుకుంటోంది. తమిళంలో ఎలాంటి పాత్రలయినా చేస్తోన్న కీర్తి తెలుగులో మాత్రం మహానటిలానే వుండిపోవాలని చూస్తోంది. ఇంత యంగ్‌ ఏజ్‌లోనే హీరోయిన్‌ ప్రధాన చిత్రాలకి షిఫ్ట్‌ అయిపోతే ఆమెతో ఇక యంగ్‌ హీరోలు నటించడానికి ముందుకి రాకపోవచ్చు. అలాగే పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు కూడా తగ్గిపోవచ్చు. మహానటి ఇమేజ్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ టాప్‌ హీరోయిన్‌ కావడం ఎలా అనే దానిపై కీర్తి అర్జంటుగా స్టడీ చేయాలి. లేదంటే వన్‌ సినిమా వండర్‌ అయిపోయే ప్రమాదముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English