ఆ హీరోకి డిపాజిట్లు కూడా రావట్లే

ఆ హీరోకి డిపాజిట్లు కూడా రావట్లే

ఒక టైమ్‌లో యువ హీరోల్లో యమ బిజీగా వున్న సందీప్‌ కిషన్‌ ఇప్పుడు ఫ్లాపుల అగాధంలో కూరుకుపోయాడు. అతని సినిమాల పట్ల ప్రేక్షకులు నామమాత్రపు ఆసక్తి కూడా చూపించడం లేదు. తమన్నా కథానాయిక కాబట్టి, నేటి తరం యువతని ఆకర్షించే అడల్ట్‌ కంటెంట్‌ వుంది కాబట్టి 'నెక్స్‌ట్‌ ఏంటి' చిత్రానికి కనీస ఓపెనింగ్స్‌ వస్తాయని ఆశించారు. కానీ ఈ చిత్రానికి డిపాజిట్లు కూడా దక్కడం లేదు. శుక్రవారం ఎలక్షన్స్‌ కారణంగా నైజాంలో సెలవు కావడంతో కొత్త సినిమాలు కవచం, సుబ్రమణ్యపురం చిత్రాలకి మంచి ఓపెనింగే వచ్చింది.

అయితే సందీప్‌, తమన్నా వున్నా కానీ 'నెక్స్‌ట్‌ ఏంటి' చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదని స్పష్టంగా తెలిసిపోయింది. శనివారం వసూళ్లు కూడా తీసికట్టుగా వుండడంతో ఈ చిత్రానికి పోస్టర్‌ ఖర్చులు కూడా రాకపోవచ్చునని ట్రేడ్‌ అంటోంది. కథల ఎంపికలో వరుసగా తప్పులు చేస్తోన్న సందీప్‌ కిషన్‌ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఎందుకో ఏదీ కలిసి రావడం లేదు. త్వరలో నిర్మాతగా కూడా అదృష్టం పరీక్షించుకుంటోన్న సందీప్‌ తన రాతని తానే మార్చుకుంటాడా? అతనికి వచ్చే యేడాది అదృష్టం కలిసి వస్తుందనే మనం కూడా ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English