ఉన్న సినిమాలకే ఖాళీ లేదంటే..

ఉన్న సినిమాలకే ఖాళీ లేదంటే..

‘2.0’ సినిమా తర్వాత రెండు వారాలకు చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. ఈ వారం ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. అందులో ‘కవచం’ మినహా సినిమాలు పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు. టాక్ అయితే దేనికీ గొప్పగా లేదు. నిన్న కొత్త సినిమాలకు ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇక వచ్చే వారం కూడా తెలుగులో పేరున్న సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు.

‘హుషారు’.. ‘భైరవగీత’ లాంటి చిన్న సినిమాలే రాబోతున్నాయి. ఐతే ఆ తర్వాతి వారానికి మాత్రం బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది. శర్వానంద్-సాయిపల్లవి-హనుల ‘పడి పడి లేచే మనసు’తో పాటు వరుణ్ తేజ్-సంకల్ప్ రెడ్డిల ‘అంతరిక్షం’ కూడా రిలీజవుతున్నాయి. ఈ రెండ సినిమాల మీదా మంచి అంచనాలున్నాయి. రెంటికీ మంచి హైప్ వచ్చింది.

వీటికి తోడుగా ‘కేజీఎఫ్’ అనే కన్నడ డబ్బింగ్ సినిమా కూడా వస్తోంది. ఈ చిత్రం ఆసక్తికర ట్రైలర్లతో తెలుగు ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఈ మూడు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఐతే వీటికి థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టం అనుకుంటుంటే.. వీటికి ఇంకో సినిమా తోడవుతోంది. అదే.. మారి-2. తమిళంలో ధనుష్-సాయిపల్లవి జంటగా బాలాజీ మోహన్ తెరకెక్కించిన చిత్రమిది. కొన్నేళ్ల కిందట వచ్చిన ‘మారి’కి కొనసాగింపుగా ఈ సినిమా తీశారు.

ఐతే ‘మారి’ జస్ట్ యావరేజ్ అనిపించుకుందంతే. తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు కానీ.. ఆడలేదు. అలాంటి సినిమాను ఇప్పుడు మరోసారి తెలుగులో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ వీకెండ్ కోసం ఇక్కడ ఆసక్తికరమైన సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వాటి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అలాంటిది ‘మారి-2’ లాంటి సినిమాను మన జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English