మంచు మనోజ్ ఆ రోజు చెబుతాడట

మంచు మనోజ్ ఆ రోజు చెబుతాడట

మంచు మనోజ్ పోయినేడాది ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాను సినిమాలు వదిలేసి సామాజిక సేవలోకి దిగబోతున్నట్లు సంకేతాలిచ్చి సంచలనం రేపాడు. ఐతే కుటుంబ సభ్యులు వారించడంతో కొంచెం వెనక్కి తగ్గాడు.

ఐతే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఒక్కడు మిగిలాడు’ దారుణమైన ఫలితాన్నందుకోవడంతో మనోజ్ నైరాశ్యంలో పడ్డట్లు కనిపించింది. ఏడాది నుంచి అసలతను సినిమా ఊసే ఎత్తట్లేదు. మనోజ్ వ్యక్తిగత జీవితంలోనూ ఏవో ఒడుదొడుకులంటూ ఊహాగానాలు వచ్చాయి. అవెంత వరకు నిజమో కానీ.. మనోజ్ అయితే సినిమాల ఊసెత్తకుండా సేవా కార్యక్రమాల్లోకి దిగిపోయాడు. రాజకీయాల్లోకి వచ్చేలా కూడా కనిపించాడు.

ఐతే ఈ మధ్య తన సొంత జిల్లా చిత్తూరుకు మకాం మార్చి ఏవో కార్యక్రమాలు చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చిన మనోజ్.. సినిమాలకు దూరమయ్యేది మాత్రం లేదని తెగేసి చెప్పాడు. తాజాగా అతను ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా ప్రకటనపై స్పష్టత ఇచ్చాడు. కొత్త ఏడాదిలో మార్చి 19న తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేస్తానన్నాడు.

మార్చి 19 మనోజ్ తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఆ రోజునే తన కొత్త సినిమాను ప్రకటిస్తానంటున్నాడు మనోజ్. మరి మనోజ్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడు.. ఆ చిత్రం సొంత బేనర్లోనే ఉంటుందా.. ఆ చిత్రమైనా అతడికి మళ్లీ బ్రేక్ ఇస్తుందా అన్నది చూడాలి. నిజంగా అతను మార్చిలో సినిమా మొదలుపెట్టేట్లయితే.. రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చే ఆలోచన లేనట్లే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English