ఎన్టీఆర్‌ కోసం ఎన్టీఆర్‌ వస్తాడా?

ఎన్టీఆర్‌ కోసం ఎన్టీఆర్‌ వస్తాడా?

బాలకృష్ణ, ఎన్టీఆర్‌ మళ్లీ కలిసిపోయినట్టే అనిపించినా కానీ ఇంకా వారి మధ్య విబేధాల గోడలు అలాగే వున్నాయనే అనుమానాలు బలపడ్డాయి. కుకట్‌పల్లి నియోజికవర్గం నుంచి టిడిపి తరఫున సోదరి పోటీ చేసినా కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారానికి దూరంగా వున్నాడు. తాను దూరంగా వుండడమే కాకుండా సోదరుడు కళ్యాణ్‌రామ్‌ని కూడా దూరంగా వుంచాడు. తారక్‌ చెబితే కళ్యాణ్‌రామ్‌ ఖచ్చితంగా ప్రచారానికి వెళ్లేవాడు. దీనినిబట్టే ఇంకా కుటుంబంలోని విబేధాలు పూర్తిగా సద్దుమణగలేదని అర్థమవుతోంది.

అరవింద సమేత విజయోత్సవానికి బాలయ్యని పిలిస్తే ఎన్టీఆర్‌ గురించి మాట మాత్రమైనా మాట్లాడకపోవడం అప్పట్లో చర్చనీయాంశమయింది. ఈ నేపథ్యంలో బాబాయ్‌, అబ్బాయ్‌ మధ్య అంతా సఖ్యంగానే వుందా లేదా అనేది 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి చేసే వేడుకలో తెలుస్తుంది. ఈ వేడుకకి ఎన్టీఆర్‌ని పిలిస్తే రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు అనుకోవచ్చు. ఎంత కాదన్నా నందమూరి మూడో తరానికి ప్రతినిధి జూనియర్‌. తాతయ్య పేరుని నిలబెట్టి వంశ ప్రతిష్టని మరింత పెంచినవాడు. కాబట్టి ఆయన జీవిత కథతో తీసిన సినిమా వేడుకలో ఎన్టీఆర్‌ వుండడం సముచితం. కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రంలో నటించాడు కనుక అతను వేడుకలో తప్పకుండా వుంటాడు. మరి ఎన్టీఆర్‌కి బాలయ్య నుంచి ఆహ్వానం అందుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English