అల్లు అర్జున్‌ కంటే అతనే బెస్టు!

అల్లు అర్జున్‌ కంటే అతనే బెస్టు!

డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌కి రెగ్యులర్‌ సినిమాలు తీయడం ఇష్టం వుండదు. తన ప్రతి చిత్రంలోను ఎంతో కొంత కొత్తదనం చూపించే విక్రమ్‌ కుమార్‌ తన మలి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో తీయడానికి చాలా ప్రయత్నించాడు. అయితే అల్లు అర్జున్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా తన కథని బ్యాలెన్స్‌ చేయలేకపోవడంతో అల్లు అర్జున్‌ డ్రాప్‌ అయ్యాడు. ఇప్పుడు అదే కథని నానితో తీస్తున్నాడు. అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌కి రాసిన కథలో నాని ఇమడగలడా అనేది కొందరికి కలుగుతోన్న అనుమానం.

అయితే విక్రమ్‌ కుమార్‌ స్టయిల్‌కి అల్లు అర్జున్‌లా భారీ బడ్జెట్‌ స్టార్‌ కంటే నానిలా మీడియం బడ్జెట్‌ స్టార్‌ ఉత్తమం. నాని సినిమాపై ప్రేక్షకులకి వుండే అంచనాలు వేరు. అతనికోసం దర్శకుడు కథాపరంగా కాంప్రమైజ్‌ అవ్వాల్సిన అవసరం పడదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అంటూ అవసరం లేకుండా పాటలు, ఫైట్లు పెట్టక్కర్లేదు. పైగా ఈ చిత్రంలో ఏదో సందేశం కూడా వుందంటున్నారు కాబట్టి ఎలా చూసుకున్నా అల్లు అర్జున్‌ మిస్‌ అవడం విక్రమ్‌కి ప్లస్సే అవుతుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English