2.0 ఫైనల్‌ ఎగ్జామ్‌కి రెడీ

2.0 ఫైనల్‌ ఎగ్జామ్‌కి రెడీ

శంకర్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌కి రెడీ అయింది. ఈ చిత్రం సేఫ్‌ అవడానికి ఛాన్స్‌ వుందా లేదా అనేది ఈ వీకెండ్‌తో తేలిపోతుంది. తొలి వారంలో తెలుగు రాష్ట్రాల నుంచి నలభై కోట్లకి పైగానే షేర్‌ రాబట్టిన ఈ చిత్రం మార్కెట్‌ అయిన రేటుకి బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే మరో ముప్పయ్‌ కోట్లు పైగానే రావాలి. దాంట్లో మూడో వంతు అయినా ఈ వీకెండ్‌లో సాధిస్తుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. లాస్ట్‌ వీకెండ్‌ పర్‌ఫార్మెన్స్‌ని బట్టి ఈ వీకెండ్‌లో పది కోట్లకి పైగా రాబట్టడానికి స్కోప్‌ అయితే వుంది. అయితే ప్రేక్షకులకి అందుబాటులోకి మరిన్ని ఆప్షన్లు కూడా వున్నాయి. కొత్తగా రిలీజ్‌ అయిన సినిమాల్లో ఏదయినా చాలా బాగుందనే టాక్‌ వస్తే ఆడియన్స్‌ అటు డైవర్ట్‌ అయిపోవడానికి ఛాన్స్‌ వుంది. పైగా గత వారానికీ ఇప్పటికీ 3డి థియేటర్లు ఏమీ పెరగలేదు. పైపెచ్చు 2డి థియేటర్లు తగ్గించేసారు.

తొలి వారంలో నైజాంలో బ్రహ్మాండంగా ఆడిన 2.0 సెకండ్‌ వీకెండ్‌ కూడా తెలంగాణలో అదే జోరు కొనసాగించడమయితే ఖాయం చేసుకోవచ్చు. ఎన్నికల సందర్భంగా శుక్రవారం సెలవు కావడం ఇక్కడ అడ్వాంటేజ్‌ అవుతుంది. హిందీలో హిట్‌ అయిన 2.0, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే మెరుగ్గా పర్‌ఫార్మ్‌ చేస్తోంది. అయితే భారీ రేట్లకి విక్రయించడం వల్ల వచ్చిన వసూళ్లు సరిపోవడం లేదు. ఈ వీకెండ్‌లో యాభై కోట్ల మార్కు దాటితే అటుపై ఎంతవరకు రీచ్‌ అవుతుందనే దానిపై బయ్యర్లో అంచనాకి వస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English