రాజమౌళి వస్తున్నాడు... రూమర్స్‌ నిజమేనా?

రాజమౌళి వస్తున్నాడు... రూమర్స్‌ నిజమేనా?

రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' మొదటి షెడ్యూల్‌ని ఫినిష్‌ చేసేసాడు. రామ్‌ చరణ్‌ 'వినయ విధేయ రామ' విడుదల కార్యక్రమాల వరకు బిజీగా వుంటాడు కనుక అంతవరకు షూటింగ్‌ జరగదు. చరణ్‌ తిరిగి సెట్స్‌ మీదకి వచ్చాక రెండవ షెడ్యూల్‌ మొదలవుతుంది. ఈలోగా రాజమౌళి కాస్టింగ్‌ ఫైనలైజ్‌ చేస్తాడు. ఇది ఇలా వుంటే, ఈ నెల 9న 'కెజిఎఫ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రాజమౌళి ముఖ్య అతిథిగా వెళుతున్నాడు. కన్నడలో రూపొందుతోన్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే సంచలనమైంది.

ఇంకా ఆసక్తికరమైన వార్త ఏమిటంటే కెజిఎఫ్‌ హీరో 'యష్‌'కి ఆర్‌ఆర్‌ఆర్‌లో విలన్‌ రోల్‌ని రాజమౌళి ఆఫర్‌ చేసినట్టు టాక్‌ వుంది. ఇప్పుడీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రాజమౌళి వెళుతుండడంతో ఈ రూమర్స్‌ నిజమేనేమో అనిపిస్తోంది. యష్‌కి కెజిఎఫ్‌ తర్వాత తెలుగునాట కూడా క్రేజ్‌ ఏర్పడడానికి అవకాశముంది. అతను కన్నడలో ఆల్రెడీ పెద్ద స్టార్‌ కనుక ఆ మార్కెట్‌ ఎలాగో కలిసి వస్తుంది. కెజిఎఫ్‌ హిందీలోను క్లిక్‌ అయితే యష్‌ ఖచ్చితంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి ప్లస్‌ అవుతాడనిపిస్తోంది. రాజమౌళి అడిగితే కాదనే నటుడే వుండడు కనుక మరి ఈ భారీ మల్టీస్టారర్‌లో విలన్‌ క్యారెక్టర్‌ యష్‌కే దక్కుతుందేమో చూద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English