ప్రభాస్‌ రూట్లో చిరంజీవి!

ప్రభాస్‌ రూట్లో చిరంజీవి!

రెండు, మూడేళ్లు తీసుకునే భారీ చిత్రాలని హీరోలు తలపెట్టినపుడు అవి పూర్తయ్యేవరకు వాటికే కట్టుబడిపోకుండా మధ్యలో వేరే చిత్రాలు చేయడానికి కూడా వీలు కల్పించుకోవడం ఉత్తమం. సాహో చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని ప్రభాస్‌ ఈలోగా మరో చిత్రం షూటింగ్‌ మొదలు పెట్టాడు. చిరంజీవి కూడా అదే డెసిషన్‌ తీసుకున్నట్టు లేటెస్ట్‌ న్యూస్‌. సైరా చిత్రం వచ్చే యేడాది విడుదల కావడం కష్టమే అనేది ఇండస్ట్రీ మాట. అయితే ఆ యేడాది కాలం పాటు చిరంజీవి ఆ చిత్రం సెట్లోనే వుండరు. ఖచ్చితంగా చాలా గ్యాప్‌ దొరుకుతుంది.

అందుకే ఆ టైమ్‌లో కొరటాల శివతో చేద్దామనుకుంటోన్న చిత్రాన్ని పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. కొరటాల శివ చిత్రం జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలవుతుందని, సైరా షెడ్యూల్స్‌కి అనుగుణంగా షూటింగ్‌ జరుగుతుందని తెలిసింది. సైరా ముందు రిలీజ్‌ చేయాలా లేక దీనిని విడుదల చేయాలా అనేది కూడా తర్వాతే డిసైడ్‌ చేస్తారట. ప్రస్తుతానికైతే కొరటాలతో చిరంజీవి సినిమా కాన్సిల్‌ అవలేదని, సైరాతో పాటు సైమల్టేనియస్‌గా షూటింగ్‌ జరుగుతుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English