ఆ సినిమాకు అంత హైప్ ఎందుకిస్తున్నారో..

ఆ సినిమాకు అంత హైప్ ఎందుకిస్తున్నారో..

కేజీఎఫ్.. కేజీఎఫ్.. కేజీఎఫ్.. ఈ మధ్య కాలంలో వివిధ సినీ పరిశ్రమల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. మామూలుగా కన్నడ సినిమాలు కర్ణాటక దాటి బయట చర్చనీయాంశం కావడం అరుదు. ఒకవేళ అలా అయినా.. అవేవో ప్రయోగాత్మాక.. ఆర్ట్ సినిమాలు అయి ఉంటాయి. కానీ ఒక స్టార్ హీరో చేసిన కమర్షియల్ మూవీ వేరే రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కావడం ‘కేజీఎఫ్’ విషయంలోనే జరుగుతోంది.

నిజానికి ఈ చిత్ర కథానాయకుడికి బయటి రాష్ట్రాల్లో అంత పాపులారిటీ లేదు. అతను మిగతా భాషల వాళ్లకు పూర్తిగా కొత్త. అయినప్పటికీ అతను నటించిన ‘కేజీఎఫ్’ చిత్రాన్ని కన్నడలోనే కాక.. తమిళం హిందీ భాషల్లోనూ తీర్చిదిద్దారు. అన్ని చోట్లా కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. గత నెలలో రిలీజైన దాని తొలి ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

కన్నడ సినిమాలో ఇంతకుముందెన్నడూ చూడని విజువల్స్.. క్వాలిటీ.. ఇంటెన్సిటీ ‘కేజీఎఫ్’ ట్రైలర్లో కనిపించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంకో ట్రైలర్ కూడా వదిలారు. అది కూడా బాగానే ఉంది. కానీ దీనికి మిగతా భాషల క్రిటిక్స్.. సెలబ్రెటీలు ఇస్తున్న హైప్ మాత్రం మరీ ఎక్కువగా అనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాను ఆహా ఓహో అని పొగిడేస్తున్నాడు. ట్రైలర్ గురించి కూడా గొప్పలు పోతున్నాడు.

ఐతే కన్నడ సినిమా స్థాయికి ఇది గొప్పగానే ఉండొచ్చు కానీ.. మిగతా భాషల్లో వస్తున్న సినిమాల క్వాలిటీ ముందు ఇదెంత? నిజానికి కథాంశం పరంగా చూస్తే ఇది పుష్కరం కిందట మన దగ్గర వచ్చిన ‘ఛత్రపతి’ని తలపిస్తోంది. ఇక్కడ కోస్టల్ బ్యాక్ డ్రాప్ తీసుకుంటే.. అక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యం తీసుకున్నారు. అంతే తేడా. విజువల్స్ పరంగా అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకుని.. కొంచెం క్వాలిటీ చూపించారు. అంతే కానీ.. ఇదేదో ‘బాహుబలి’ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుండటం ఆశ్చర్యమే. ఈ చిత్రానికి అంత హైప్ అయితే అవసరం లేదంటున్నారు సోషల్ మీడియా జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English