దేవరకొండ అబద్ధాలాడుతున్నాడా?

దేవరకొండ అబద్ధాలాడుతున్నాడా?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా అది. ఆ చిత్రాన్ని హోల్ సేల్ రేటు కింద రూ.5.5 కోట్లకు కొన్న ఏషియన్ మూవీస్.. వసూళ్ల పంట పండించుకుంది. ఆ చిత్రం అన్ని రకాలుగా రూ.50 కోట్ల దాకా ఆదాయం తెచ్చిపెట్టింది. ఇక ‘గీత గోవిందం’ సంగతి చెప్పాల్సిన పని లేదు. దీని మీద మహా అయితే ఓ పది కోట్లు ఖర్చు పెట్టి ఉంటారేమో. కానీ ఏకంగా థియేట్రికల్ రన్ ద్వారానే రూ.70 కోట్ల దాకా షేర్ రాబట్టింది.

ఇక డిజిటల్.. శాటిలైట్.. డబ్బింగ్.. రీమేక్ హక్కుల రూపంలో ఎంత ఆదాయం వచ్చిందో? ‘అర్జున్ రెడ్డి’ టైంలో విజయ్ రేంజ్ ఎవ్వరూ ఊహించలేకపోయి ఉండొచ్చు.. ‘గీత గోవిందం’ సంగతి అలా కాదు. ఈ చిత్రానికి ముందే మంచి హైప్ వచ్చింది. దీనికి ఒక పెద్ద స్టార్ హీరో సినిమా స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయంటే అందుకు విజయే ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు.

'నోటా’ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా నిర్మాతకు లాభాలు మిగిల్చింది. ఇక ‘ట్యాక్సీవాలా’ సంగతి చెప్పాల్సిన పని లేదు. పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు లాభాలు తెచ్చింది. మరి ఈ సినిమాలకు విజయ్ ఎంతెంత పారితోషకాలు తీసుకున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమాలు సక్సెస్ అయిపోతున్నాయని.. భారీ వసూళ్లు రాబడుతున్నాయని.. బిజినెస్ బాగా జరుగుతోందని తానేమీ పారితోషకం పెంచేయలేదని.. అలా చేస్తే తన మీద తాను ప్రెజర్ పెంచుకున్న వాడిని అవుతానని.. అందుకే తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని అన్నాడు విజయ్.

ఏదైనా నిజాయితీగా మాట్లాడినట్లు కనిపిస్తాడు కాబట్టి అది నిజమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చూస్తే ఫోర్బ్స్ సెలబ్రెటీ శ్రీమంతుల జాబితాలో అతడికి 72వ స్థానం దక్కింది. రామ్ చరణ్ సైతం అతడితో సమానంగా అదే స్థానంలో ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ భారీగానే డబ్బులు తీసుకుంటున్నాడని స్పష్టమవుతోంది. బహుశా పారితోషకం తక్కువగా తీసుకుని.. ఆ తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటుండొచ్చు. అతను అడక్కపోయినా.. ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ చిత్రాలు ఇబ్బడిముబ్బడిలా లాభాలు తెచ్చిన నేపథ్యంలో నిర్మాతలే అతడికి వాటా ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనా తాను తక్కువ పారితోషకమే తీసుకుంటున్నట్లుగా విజయ్ చెప్పిన మాటలు మాత్రం అబద్ధాలనే భావించాల్సి వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English