‘2.0’కు చిన్న సినిమాల భయం

‘2.0’కు చిన్న సినిమాల భయం

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే దానికి పోటీకి సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడతారు నిర్మాతలు. అందులోనూ ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. తర్వాతి రెండు మూడు వారాల్లో కూడా వేరే సినిమాలు విడుదల చేయడం సాహసమే. ఐతే రజనీ కొత్త సినిమా ‘2.0’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ భయం ఏమీ కనిపించడం లేదు.

తెలుగులో ఈ వారం నాలుగు చిన్న-మీడియం రేంజ్ సినిమాలు రిలీజవుతున్నాయి. తమిళ నాట కూడా రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలాంటి సినిమాల్ని చూసి ‘2.0’ బయ్యర్లే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ‘2.0’కు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ఈ చిత్రం ఒక వారం ఆడేస్తే సేఫ్ అయ్యే సినిమా కాదు. ఇది సేఫ్ జోన్లోకి రావాలంటే ఇంకో రెండు మూడు వారాలైనా ఆడాలి.

ఇటు తెలుగులో.. అటు తమిళంలో ‘2.0’ బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. 50-60 శాతం మాత్రమే పెట్టుబడి రివకరీ అయింది. వీకెండ్ తర్వాత సినిమా వీక్ అయిపోవడం.. 2డీ స్క్రీన్లలో కలెక్షన్లు బాగా పడిపోవడం కంగారు పెడుతోంది. ఇలాంటి సమయంలో ఈ వారం రిలీజవుతున్నవి చిన్న స్థాయి సినిమాలే అయినప్పటికీ.. వాటికి పాజిటివ్ టాక్ వస్తే ‘2.0’ కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమో.. స్క్రీన్లు మరింత తగ్గించాల్సి వస్తుందేమో అన్న కంగారు బయ్యర్లలో కనిపిస్తోంది.

తెలుగులో ఈ వారం ‘కవచం’తో పాటు ‘సుబ్రహ్మణ్యపురం’.. ‘నెక్స్ట్ ఏంటి’.. ‘శుభలేఖ+లు’ సినిమాలొస్తున్నాయి. వాటిలో ‘శుభలేఖ+లు’ సంగతి పక్కన పెట్టేసినా.. మిగతా మూడు ఓ మోస్తరుా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ‘కవచం’కు మాస్‌లో మంచి స్పందనే కనిపిస్తోంది. ‘సుబ్రహ్మణ్యపురం’ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌లాగా కనిపిస్తోంది. ‘నెక్స్ట్ ఏంటి’ రొమాంటిక్ సినిమాల్ని ఇష్టపడేవారిని మెప్పించేలా ఉంది. ఈ సినిమాల్లో రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ‘2.0’ వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. మరోవైపు తమిళంలో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయంలోనూ కొంచెం టెన్షన్ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English