‘కవచం’కి అమితాబ్ బచ్చన్ కనెక్షన్

‘కవచం’కి అమితాబ్ బచ్చన్ కనెక్షన్

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ‘కవచం’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతను పోలీస్ పాత్రలో కనిపించబోతుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో తన పాత్ర గురించి.. కథ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు శ్రీనివాస్. ఇందులో శ్రీనివాస్ పాత్ర పేరు విజయ్ అట.

ఆ పాత్రకు ఆ పేరు పెట్టడానికి అమితాబ్ బచ్చనే స్ఫూర్తి అట. తాను అమితాబ్ నటించిన సినిమాలు చాలా చూస్తుంటాని.. ఆయన తన కెరీర్లో చాలా పోలీస్ క్యారెక్టర్లు చేశారని.. వాటిలో చాలా వరకు ఆయన పేరు విజయ్‌గానే ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే తన పాత్రకు కూడా విజయ్ అనే పేరే పెట్టుకున్నామని శ్రీనివాస్ వెల్లడించాడు.

‘కవచం’ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సినిమా అని.. తనపై వచ్చిన ఆరోపణలపై ఒక పోలీస్ ఎలా స్పందించాడు.. 24 గంటల్లో తనపై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా రుజువు చేశాడు అనే కథతో ఈ చిత్రం తెరకెక్కిందన్నాడు. కథ ముందుకు సాగేకొద్దీ ఉత్కంఠభరితంగా ఉంటుందని.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుందని అన్నాడు.

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల కొత్త వాడైనా ఒక అనుభవజ్ఞుడైన డైరెక్టర్ లాగా ఈ చిత్రాన్ని డీల్ చేశాడని చెప్పాడు. తన గత సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్లుగా మిగిలాయని.. ఐతే ‘కవచం’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించామని.. అందువల్ల దీనికి టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని శ్రీనివాస్ తెలిపాడు. తన గత సినిమా ‘సాక్ష్యం’ మీద చాలా ఆశలు పెట్టుకున్నానని.. ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డానని.. అది ఆడకపోవడంతో మూడు రోజులు బయటికే రాలేదని.. ‘కవచం’ షూటింగ్‌లో పడ్డాకే ఆ బాధను మరిచిపోగలిగానని శ్రీనివాస్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English