దేవరకొండ ఈజ్ ఈక్వల్ టు రామ్ చరణ్!

దేవరకొండ ఈజ్ ఈక్వల్ టు రామ్ చరణ్!

ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్-100 ఇండియన్ సెలబ్రెటీల లిస్టు ఆసక్తికర చర్చలకు అవకాశమిచ్చింది. టాలీవుడ్ నుంచి నుంచి ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యుత్తమంగా 24వ స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ అసలు సినిమాల్లోనే నటించలేదు.

'అజ్నాతవాసి' సినిమాను గత ఏడాదే పూర్తి చేయగా.. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైంది. కాబట్టి దాని పారితోషకం ఈ ఏడాది ఆదాయంలో కలుస్తుందా లేదా అన్నది డౌటు. మరి సినిమాలకు దూరమై రాజకీయాలకు పరిమితం అయిన పవన్ ఫోర్బ్స్ సెలబ్రెటీ శ్రీమంతుల జాబితాలో టాలీవుడ్ నుంచి అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ జాబితాలో మరో విశేషం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు, రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండకు సమానంగా 72వ స్థానం రావడం. చరణ్ రేంజేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఈ ఏడాది 'రంగస్థలం'తో మెగా సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. 'వినయ విధేయ రామ' కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకూ భారీ పారితోషకం తీసుకుని ఉంటాడు. మరి విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' తర్వాత ఎంత రైజ్ అయినప్పటికీ చరణ్‌తో సమానంగా ఆదాయం ఆర్జించడం ఆశ్చర్యమే. మరి మెగా బ్లాక్ బస్టర్ 'గీత గోవిందం'తో అతడికి ఎంత ఆదాయం అందిందో? 'నోటా', 'ట్యాక్సీవాలా' సినిమాలకు ఎంత పుచ్చుకున్నాడో అన్న చర్చ నడుస్తోంది జనాల్లో.

ఈ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ 14వ స్థానంలో నిలిచాడు. మరో కోలీవుడ్ స్టార్ విజయ్ 26వ స్థానంలో ఉన్నాడు. పవన్ తర్వాత టాలీవుడ్ నుంచి అత్యుత్తమ స్థానం జూనియర్ ఎన్టీఆర్ దే. అతను 28వ ర్యాంకులో ఉన్నాడు. మహేష్ బాబు 33వ ర్యాంకులో నిలిచాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English