రాజమౌళికే చెమటలు పట్టిస్తున్నారు

రాజమౌళికే చెమటలు పట్టిస్తున్నారు

ఫలానా హీరో ఫలానా మాట అనేసాడంటూ వాళ్లు అన్నా, అనకపోయినా దానిని హెడ్డింగ్‌గా పెట్టి వీడియోలు రూపొందించే ఛానళ్లు వున్న జమానా ఇది. ఇక అలాంటిది ఒక సినిమా గురించిన ఊహాగానాల విషయంలో అడ్డుకట్ట వుంటుందా? ఎన్టీఆర్‌, చరణ్‌తో తీస్తోన్న మల్టీస్టారర్‌ గురించిన విశేషాలు ఏమైనా చెబితే సస్పెన్స్‌ తగ్గిపోయి, సినిమా పట్ల ఆసక్తి తగ్గే అవకాశం వుందని రాజమౌళి ఆ విశేషాలన్నీ గోప్యంగా వుంచుతున్నాడు. అయితే రాజమౌళి చెప్పలేదు కదా అని మీడియా ఊరుకోవడం లేదు.

తమకి తోచిన విధంగా కథలు అల్లేసి ఇదే కథ అంటూ ఇప్పటికి చాలా విశేషాలని ప్రచారంలోకి తెచ్చారు. ఎన్టీఆర్‌ ఎప్పుడో కాస్త ఒళ్లు చేసిన ఫోటోలు తెచ్చి ఇదే రాజమౌళి సినిమాలో లుక్‌ అంటూ హంగామా చేసారు. తమ సినిమా గురించి ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వకపోయినా ఏదో విధంగా దానిని న్యూస్‌లో వుంచడం చూసి రాజమౌళి షాకయ్యాడట. సమాచారం ఇవ్వని పక్షంలో న్యూస్‌ ఎలా క్రియేట్‌ చేస్తారో, ఎంత న్యూసెన్స్‌ చేయగలరో చూసి రాజమౌళికే చెమటలు పట్టేసాయట. ఇకపై ఈ చిత్రం గురించిన సమాచారం మరీ అంత గోప్యంగా వుంచరాదని, మీడియాకి ఇవ్వాల్సిన ఫీడ్‌ తరచుగా ఇస్తుండాలని డిసైడ్‌ అయ్యాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English