దిల్‌ రాజు బడ్జెట్‌ దాటేసింది

దిల్‌ రాజు బడ్జెట్‌ దాటేసింది

ఎఫ్‌2 చిత్రంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించడం పెద్ద ప్లస్సే. ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి చేస్తోన్న ఈ మల్టీస్టారర్‌కి అన్ని హంగులు వారి రేంజ్‌కి తగ్గట్టే వుండాలి. అయితే ఈమధ్య కాలంలో ఫ్లాపుల బారిన పడిన దిల్‌ రాజు తన సినిమాలకి కాస్ట్‌ కటింగ్‌ విధిస్తున్నాడు. మామూలుగా ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగుండాలని తాపత్రయపడే దిల్‌రాజు గత రెండు చిత్రాలు 'శ్రీనివాస కళ్యాణం', 'హలోగురు ప్రేమకోసమే' మరీ మధ్య తరగతి సినిమాల్లా అనిపించాయి. ఆ సినిమాలకే వర్కవుట్‌ కాకపోవడంతో 'ఎఫ్‌ 2'కి కూడా బడ్జెట్‌పై మూత పెట్టేసాడు.

ఫలానా లెక్క ఇచ్చి ఇంతలోనే సినిమా తీయాలంటూ కండిషన్‌ పెట్టాడు. సినిమా చివరకు వచ్చేసరికి సరిపడా నిధులు లేవట. అందుకే ఐటెమ్‌ సాంగ్‌ని పెద్ద హీరోయిన్‌తో తీద్దామని అనుకున్నదల్లా అనసూయతో కానిచ్చేస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ అయితే యాభై, అరవై లక్షలు డిమాండ్‌ చేస్తుంది. ఒక మాదిరి హీరోయిన్‌ అయినా పాతిక లక్షలు చదివించక తప్పదు. అదే అనసూయ అయితే పది లక్షల్లోపే సాంగ్‌ అయిపోతుందని ఆమెని తీసుకున్నారట. అయితే ఇంత పెద్ద మల్టీస్టారర్‌లో ఐటెమ్‌ సాంగ్‌ అనసూయతో చేయించడమేంటని ఇప్పటికే కామెంట్లు పడుతున్నాయి. అవును మరి... రంగమ్మత్తగా ఆంటీ పాత్రలకి ప్రమోట్‌ అయ్యాక ఇప్పుడు ఐటెమ్‌ గాళ్‌ అంటారేంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English