నితిన్‌ బాగా బెదిరిపోయాడు

నితిన్‌ బాగా బెదిరిపోయాడు

'శ్రీనివాస కళ్యాణం'పై నితిన్‌ ఎంతగా ఆశలు పెట్టుకున్నాడంటే, దిల్‌ రాజు తనకి గ్యారెంటీగా ఇచ్చేస్తాడనే ధీమాతో తను రెగ్యులర్‌గా తీసుకునే పారితోషికంలో సగమే ఛార్జ్‌ చేసాడు. వరుసగా రెండు పెద్ద ఫ్లాపులు తగిలిన దశలో దిల్‌ రాజు వెనక వున్నాడనే ధీమాతో వున్న నితిన్‌కి 'శ్రీనివాస కళ్యాణం'తో షాక్‌ గట్టిగానే తగిలేసింది. అందుకే ఆ చిత్రం తర్వాత కాన్ఫిడెన్స్‌ ఫుల్‌గా కోల్పోయిన నితిన్‌ తదుపరి చిత్రాన్ని అంత తేలిగ్గా పట్టాలెక్కించడం లేదు. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా ఎప్పుడో ఓకే అయినా కానీ దానిని మొదలు పెట్టడం లేదు.

కథాపరంగా ఫుల్‌ కాన్ఫిడెన్స్‌ వస్తే తప్ప షూటింగ్‌ మొదలు పెట్టకూడదని చెప్పేసాడు. వెంకీ కుడుముల ఎన్ని వెర్షన్లు రాసినా కానీ సెకండాఫ్‌పై నితిన్‌ డౌట్స్‌ వ్యక్తం చేస్తూనే వున్నాడు. మరోవైపు వేరే మంచి కథలు ఏమైనా తన చేజారిపోకుండా అటు కూడా ఒక లుక్కు వేసి వుంచాడు. ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతితో టచ్‌లో వుంటూనే తమిళ సినిమా 'రాక్షసన్‌' రీమేక్‌ రైట్స్‌ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మరో ఫ్లాప్‌ పడితే, ఒకప్పుడు అనుభవించిన టార్చర్‌ రిపీట్‌ అవుతుందని నితిన్‌ బాగా వర్రీ అవుతున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అసలే మిడిల్‌ రేంజ్‌ హీరోల మధ్య పోటీ తీవ్రంగా వుండడంతో ఈ టైమ్‌లో ఇంకో మిస్టేక్‌ చేస్తాననే భయంతో నితిన్‌ మరీ డిఫెన్స్‌లో పడిపోయినట్టున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English