నాలుగు భాషల ‘క్వీన్’ ఆమే కావాల్సిందట

నాలుగు భాషల ‘క్వీన్’ ఆమే కావాల్సిందట

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ రీమేక్ గురించి చాలా ఏళ్ల పాటు చర్చ నడిచింది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ ఒకేసారి రీమేక్ చేయాలని చూశారు. నాలుగు భాషల్లో ఒకే కథానాయికను పెట్టి సినిమా తీయాలని అనుకున్నారు. అందుకు తగ్గ కథానాయిక ఎవరంటూ కొన్నేళ్ల పాటు అన్వేషించారు. చివరికి నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్లను పెట్టి సినిమా తీశారు. తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా కథానాయికగా నటిస్తే.. తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేసింది. మలయాళంలో మాంజిమా మోహన్.. కన్నడలో పారుల్ యాదవ్ ప్రదాన పాత్రలు పోషించారు. సౌత్ ఇండియాలో కాజల్ అగర్వాల్ అన్ని చోట్లా పాపులరే. మరి ఆమెనే పెట్టి నాలుగు భాషల్లో తీయొచ్చు కదా అని జనాలకు ఆలోచన రావడం సహజం.

నిజానికి ముందు ఇలాగే అనుకున్నారట. నాలుగు భాషల్లోనూ తననే కథానాయికగా పెట్టి ‘క్వీన్’ రీమేక్ చేయాలన్న ప్రపోజల్‌తో తన ముందుకు నిర్మాతలు వచ్చినట్లు కాజల్ వెల్లడించింది. ఒక దశలో తెలుగు-తమిళం వరకైనా తనతో సినిమా చేయాలని కూడా అనుకున్నారని.. కానీ చివరికి తనను తమిళ వెర్షన్‌కు మాత్రమే పరిమితం చేశారని కాజల్ చెప్పింది. ఇందుకు కారణాలేంటో చెప్పలేదు కానీ.. చివరికి ఒక వెర్షన్లో నటించడమే మంచిదని తనకు అనిపించినట్లు కాజల్ వెల్లడించింది. ఒక కథను నాలుగు భాషల్లో నలుగురు కథానాయికలతో రూపొందించడం ఇదే తొలిసారని.. ‘క్వీన్’లో కంగనా చాలా సహజంగా నటించిందని.. అందంగా, అమాయకంగా కనిపించిందని, ఆ లక్షణాలు తన పాత్రలోనూ ప్రతిబింబించాలన్న తపనతో పని చేశానని కాజల్ చెప్పింది. ఈ సినిమా తన కెరీర్లో ఒక మైలురాయి అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English