2.0 ఆశల్ని చిదిమేసేది ఏదైనా వుందా?

2.0 ఆశల్ని చిదిమేసేది ఏదైనా వుందా?

వీక్‌ డేస్‌లో కలక్షన్లు వీక్‌ అయినా కానీ సెకండ్‌ వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటుందని, శని, ఆదివారాల్లో కనీసం పది కోట్ల షేరయినా రాబట్టుకుంటుందని 2.0 పై బయ్యర్లు ఆశ పెట్టుకున్నారు. అయితే 2.0కి సెకండ్‌ వీకెండ్‌లో సోలో రన్‌ దొరకడం లేదు. ఏకంగా నాలుగు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి కనుక ఫోకస్‌ ఒకే సినిమాపై ఖచ్చితంగా వుండదు.

ఈ నాలుగు సినిమాల్లో ఏదయినా బాగా క్లిక్‌ అయితే 2.0 వీకెండ్‌ వసూళ్లకి గండి కొట్టగలదు. నాలుగు సినిమాల్లోను 'కవచం' ఆల్‌రౌండ్‌ సినిమాలా కనిపిస్తోంది. సుబ్రమణ్యపురం, నెక్స్‌ట్‌ ఏంటి చిత్రాలకి కూడా వాటి ఆకర్షణలు వాటికున్నాయి. మరో చిన్న సినిమా శుభలేఖ+లు కూడా ఆకర్షణీయంగానే వుంది. కవచం మాస్‌ సెంటర్స్‌లో ఎఫెక్ట్‌ చేయగలిగితే, మిగతా మూడింటికి ఏ సెంటర్స్‌లో పుల్‌ వుండే అవకాశముంది. ఈ చిత్రాల్లో ఏదీ 2.0కి మించి ప్రేక్షకులని ఆకర్షించలేదని, ఆకర్షించకూడదని ఆ సినిమా బయ్యర్లు కోరుకుంటున్నారు.

 అయితే మరీ ఇన్ని కొత్త ఆప్షన్స్‌ అందుబాటులో వుండడంతో 2.0ని సెకండ్‌ టైమ్‌ చూడాలనుకునే వారు ఇటు వెళ్లిపోయే ఛాన్స్‌ లేకపోలేదు. ఏదేమైనా ఈ శుక్రవారం విడుదలవుతోన్న చిన్న సినిమాలని కూడా చిన్నచూపు చూడ్డానికి లేదు. ఏ పుట్టలో ఏ పాముందో, ఏది చిట్టి ఉట్టికి సొట్ట పెడుతుందో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English