అదిరిందమ్మా అనుష్కా!

అదిరిందమ్మా అనుష్కా!

జీరో సైజ్‌ ఫిజిక్‌ వద్దని, కర్వ్స్‌ ఉండడమే ముద్దు అని కొందరు సీనియర్‌ హీరోయిన్స్‌ నిండుగా కనిపిస్తున్నారు. కానీ కొందరు హీరోయిన్స్‌ మాత్రం ఇంకా జీరో సైజ్‌పై మోజు వీడడం లేదు. బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతోన్న అనుష్క శర్మ ప్రస్తుతం జీరో సైజ్‌ ఫిజిక్‌ని ఎండార్స్‌ చేస్తోంది. కాస్త బొద్దుగా, ముద్దుగా ఉండే అనుష్క శర్మ ఇప్పుడు బక్కపలచగా మారిపోయింది.

కరీనా కపూర్‌, అమీషా పటేల్‌ తదితరుల తర్వాత జీరో సైజ్‌కి నయా మోడల్‌గా మారింది. అయితే మిగతా వారి మాటెలా ఉన్నా కానీ అనుష్క శర్మ మాత్రం ఈ కొత్త లుక్‌లో ఇంకా హాట్‌గా ఉందని కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. అనుష్క ఇదే ఫిజిక్‌ కంటిన్యూ చేసినట్టయితే ఆమె తప్పకుండా కరీనా, కత్రినా తదితరులకి గట్టి పోటీనిస్తుందని కూడా అంటున్నారు. అందుకు తగ్గట్టే ఆమెకి కొన్ని భారీ సినిమాల్లో నటించే ఆఫర్లు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు