బన్నీ దిగుతున్నాడు... మహేష్‌ కంటే బలంగా!

బన్నీ దిగుతున్నాడు... మహేష్‌ కంటే బలంగా!

మహేష్‌బాబు మల్టీప్టెక్స్‌ బిజినెస్‌లోకి దిగడం సర్వత్రా హాట్‌ టాపిక్‌ అయింది. సినిమా హీరోలు థియేటర్ల బిజినెస్‌ జోలికి ఇంతవరకు పోలేదు. అదంతా నిర్మాతల రాజ్యంలా వుండేది. సురేష్‌బాబు, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, యువి క్రియేషన్స్‌... ఇలా ఎటు చూసినా నిర్మాతలే ఎగ్జిబిషన్‌ బిజినెస్‌లో వున్నారు. మహేష్‌ రాకతో ఇప్పుడు ఒక్కసారిగా ఎగ్జిబిషన్‌ బిజినెస్‌కి గ్లామర్‌ వచ్చింది.

కేవలం ఇరవై పర్సెంట్‌ వాటాతోనే ఏఎంబి సినిమాస్‌ మహేష్‌ థియేటర్లుగా చలామణీ అయిపోతున్నాయి. మహేష్‌ బ్రాండింగ్‌ పార్టనర్‌షిప్‌ షేర్‌ ఎక్కువ కావడం వల్ల మిగతా ఎగ్జిబిటర్ల మాదిరిగా అతనికి రిస్కు వుండదు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఇతర హీరోలు కూడా ఈ రంగంలోకి దిగుతున్నారు. అల్లు అర్జున్‌కి ఎప్పట్నుంచో ఈ రంగంపై దృష్టి వుంది. ఎలాగో తన తండ్రి అల్లు అరవింద్‌ లీజులో చాలా థియేటర్లు వుండడం, భీమవరం, పాలకొల్లులో వారికి సొంత థియేటర్లు వుండడంతో పాటు బన్నీ వాస్‌కి కూడా దీనిపై పూర్తి అవగాహన వుండడంతో అల్లు అర్జున్‌ పెద్ద రేంజిలో ఈ బిజినెస్‌లోకి దిగనున్నాడు.

హైదరాబాద్‌లో ఒకట్రెండు మల్టీప్లెక్సులే కాకుండా కోస్తా ప్రాంతంలో, అమరావతి పరిసరాల్లో కూడా పెద్ద ఎత్తున థియేటర్ల నిర్మాణం చేపట్టనున్నాడని చెప్పుకుంటున్నారు. హీరోగా ఏడాది ఒకటే సినిమా చేస్తోన్న అల్లు అర్జున్‌కి ఖాళీ సమయం ఎక్కువే వుండడంతో అటు నిర్మాణంలోకి కూడా దిగుతున్నాడని అంటున్నారు. ప్రభాస్‌కి కూడా ఈ ఆలోచన వుందని అప్పట్లో బాగా వినిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English