ఎన్టీఆర్‌ బయోపిక్‌... చాట భారతం?

ఎన్టీఆర్‌ బయోపిక్‌... చాట భారతం?

బయోపిక్‌లు తీసేముందే ఏది తీయాలి, ఎంత వుంచాలి అనే దానిపై అవగాహన వుండాలి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో ముందునుంచి దర్శకులకి క్లారిటీ లేకుండా పోయింది. ఆ కన్‌ఫ్యూజన్‌ తట్టుకోలేకే తేజ మధ్యలో డ్రాప్‌ అయిపోయాడు. క్రిష్‌ దానికి ఒక రూపమిచ్చి, అంచనాలయితే పెంచేసాడు కానీ మొదలు పెట్టే ముందే బౌండ్‌ స్క్రిప్ట్‌ డిసైడ్‌ అవలేదు.

దీంతో ఎన్టీఆర్‌ జీవితంలోని పలు ముఖ్య ఘట్టాలన్నీ షూట్‌ చేసేసారు. తీరా దానిని మూడు గంటల సినిమాగా కుదించడం వీలు కాలేదు. అందుకని అయిదు గంటల సినిమా చేసి రెండు భాగాలుగా విడగొట్టారు. అయితే ప్రస్తుతం అంతకుమించిన కంటెంట్‌ చేతిలో వుందని, ఏ సీన్‌ని తీసేయడానికి అటు దర్శకుడికి లేదా ఇటు బాలకృష్ణకి నచ్చడం లేదని, దీంతో మొదటి భాగం లెంగ్త్‌ బాగా పెరిగిపోయిందని టాక్‌ వినిపిస్తోంది.

మొదటి భాగం మొత్తం ఎన్టీఆర్‌ సినీ జీవిత విశేషాలతోనే నడిచిపోతుందట. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో మొదటి భాగం ఎండ్‌ అవుతుందట. అయితే ఎన్టీఆర్‌ ఎన్నో గొప్ప చిత్రాలు చేయడం వల్ల ఆయా సీన్లన్నీ ఇందులో వుండాలని అన్నీ తీసేయడం వల్ల, మరోవైపు ఎన్టీఆర్‌కి భార్యా పిల్లలతో వున్న అనుబంధాలని కూడా కవర్‌ చేయడం వల్ల లెంగ్త్‌ పెరిగిపోయిందని, ఎడిటింగ్‌కి కష్టమవుతోందని టాక్‌ వినిపిస్తోంది. బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ముగించుకోవడంతో ఇక ఆయన సమక్షంలో ఫైనల్‌ కట్‌ రెడీ చేస్తారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English