బెల్లంకొండతో కాజల్‌ రిలేషన్‌ ఏంటి?

 బెల్లంకొండతో కాజల్‌ రిలేషన్‌ ఏంటి?

హీరో హీరోయిన్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్‌ ఏర్పడడం సహజమే కానీ ఒక సీనియర్‌ హీరోయిన్‌ ఒక యువ హీరోతో మరీ క్లోజ్‌గా మసలుకోవడమే రూమర్స్‌కి తావిస్తోంది. చిన్న హీరోల నుంచి చిరంజీవి వరకు అందరితో నటించేసిన కాజల్‌ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాల్లో చేస్తోంది. అందులో మొదటి చిత్రం కవచం ఈ శుక్రవారం విడుదల కానుంది. మరో చిత్రం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

కవచం ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్‌ని శ్రీనివాస్‌ ఆకాశానికి ఎత్తేస్తోంటే కాజల్‌ కూడా అతని గురించి వెరైటీ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చింది. అతని ఉత్సాహం తనని కట్టి పడేస్తుందని, తండ్రి పేరు వాడుకోకుండా తనని తాను నిరూపించుకోవడం కోసం కష్టపడతాడని, తన ఆలోచనలు కూడా అలాగే వుంటాయని, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తామని, ఒకేలా వుంటామని కాజల్‌ చెప్పింది.

కవచం చిత్రంలో కాజల్‌ పేరుని శ్రీనివాస్‌ సిఫార్సు చేయగా, అంత ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ కాకపోయినా కాజల్‌ చేసేసిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆమధ్య కాజల్‌ని తన భుజాలపై ఎక్కించుకుని శ్రీనివాస్‌ దిగిన ఫోటో వైరల్‌ అయింది. తాజాగా వీరిద్దరి స్టేట్‌మెంట్స్‌తో ఈ రిలేషన్‌ గాసిప్‌ సర్కిల్స్‌ని యమగా ఆకర్షిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English