హోప్స్‌ వదిలేసుకున్న 2.0?

హోప్స్‌ వదిలేసుకున్న 2.0?

ఆదివారం వసూళ్లు అదరగొట్టిన 2.0 భయపడ్డట్టుగానే వీక్‌ డేస్‌లో బాగా వీక్‌ అయిపోయింది. రాంగ్‌ సీజన్‌లో రావడం ఒక కారణమయితే, సరిపడా 3డి థియేటర్లు లేకపోవడం మరో బలహీనత అయింది. తెలుగు రాష్ట్రాల సంగతి వచ్చే వారాంతానికి తేలుతుంది కానీ తమిళనాడులో మాత్రం వంద కోట్ల షేర్‌ రావడం అసాధ్యమని తెలిసిపోయింది. దీంతో 2.0 మేకర్లు అప్పుడే ఇతర ప్రపంచ మార్కెట్ల మీద దృష్టి పెట్టారు. చైనాలో నలభై ఏడు వేల 3డి స్క్రీన్లలో మే, 2019లో విడుదల చేస్తామని ప్రకటించారు.

చైనాలో ఇండియన్‌ సినిమాలు బాగానే ఆడుతున్నాయి కానీ 2.0లాంటి చిత్రానికి ఆదరణ లభించే అవకాశం లేదు. ఈ తరహా చిత్రాలని హాలీవుడ్‌ లేదా చైనా నుంచే రూపొందిస్తూ వుంటారు కనుక ఇప్పుడు ఇండియన్‌ గ్రాఫిక్స్‌ చూడడం కోసం చైనీయులు ఎగబడిపోరు. ఇండియన్‌ సినిమాల్లో ఎమోషనల్‌ కంటెంట్‌ వున్నవి మాత్రమే చైనాలో క్లిక్‌ అవుతున్నాయి. నష్టాల్లో కొంత మొత్తాన్ని పూడ్చుకోవడానికి ఈ తరహా రిలీజ్‌లు పనికి వస్తాయేమో కానీ ఎప్పుడో మే నెలలో జరగబోయే తంతుకి ఇప్పుడు హడావిడి అనవసరం. తమిళంలో వసూళ్లు పెంచడం కోసం ఏమి చేయవచ్చు అనే దానిపై దృష్టి పెడితే నష్టాలని తగ్గించుకునే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English