ఈ పాటతో థియేటర్ల టాప్ లేచిపోవాల్సిందే

ఈ పాటతో థియేటర్ల టాప్ లేచిపోవాల్సిందే

ఒకరికొకరు పోటీ అనుకున్న ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి ఒకేసారి తెరమీద కనిపిస్తే ప్రేక్షకులకు వచ్చే కిక్కే వేరు. హిందీ ప్రేక్షకులు ఈ నెల 21న అలాంటి అరుదైన దృశ్యమే చూబోతున్నారు. బాలీవుడ్లో సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి ‘జీరో’ సినిమాలో సందడి చేయబోతున్నారు. షారుఖ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతున్న విషయం ఇంతకుముందే వెల్లడైంది.

ఈ పాట తాలూకు చిన్న ప్రోమోను కొన్నాళ్ల కిందట రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఏకంగా సగానికి పైగా పాటను విడుదలకు ముందే రిలీజ్ చేసేసింది చిత్ర బృందం. ఈ పాట లీడ్ సీన్‌తో పాటు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసే వీడియోను రిలీజ్ చేశారు.

షారుఖ్ ఈ చిత్రంలో మరగుజ్జు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అతడిని జీరో అని.. ఎందుకు పనికి రాని వాడని వెక్కిరిస్తుంటారు. అలాంటివాడు ఓ అందమైన అమ్మాయి మనసు గెలుస్తాడు. ఆమె అతడికి ముద్దు కూడా ఇస్తుంది. అప్పుడు అపరిమిత ఆనందంతో ఓ పాటేసుకుంటాడు. ఆ పాటలోనే సల్మాన్ వస్తాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులతో అదరగొడతారు. ఈ పాటలు స్టార్ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, రెమో డిసౌజా కూడా తళుక్కుమనడం విశేషం.

ఇక ఈ పాటలో షారుఖ్-సల్మాన్ కెమిస్ట్రీ మామూలుగా లేదు. ఎవరి స్టయిల్లో వాళ్లు అదరగొట్టేశారు. పాట లిరిక్స్ కూడా చాలా సరదాగా ఉన్నాయి. చివర్లో షారుఖ్ ఎగిరి సల్మాన్ చంకనెక్కడం.. అతడికి ముద్దు ఇవ్వడం కొసమెరుపు. ఈ పాట థియేటర్లలో మామూలుగా పేలేలా లేదు. అభిమానుల హడావుడికి థియేటర్ల టాప్ లేచిపోయేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English