పబ్లిక్‌గా ముద్దు పెట్టి, ప్రైవేట్‌గా సారీ

  పబ్లిక్‌గా ముద్దు పెట్టి, ప్రైవేట్‌గా సారీ

కవచం చిత్రం ఈవెంట్‌లో కాజల్‌ని ప్లాన్‌ చేసి మరీ ముద్దు పెట్టుకున్న సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు విమర్శల పాలయిన సంగతి తెలిసిందే. ఆమెని ముద్దు పెట్టుకోవడం ఎందుకు కుదరదు అంటూ తమన్‌తో ఛాలెంజ్‌ చేసి మరీ ముద్దు పెట్టినట్టు స్టేజీ మీదే చోటా ఒప్పుకున్నాడు. అవకాశాన్ని వాడుకుని కాజల్‌ని ముద్దాడిన చోటా ఆ తర్వాత ఆమెకి కాల్‌ చేసి 'ఫీలయ్యావా' అని అడిగాడట.

ఫీలయితే కనుక సారీ అని కూడా చెప్పాడట. అయితే ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని, చోటాతో తనకి మంచి సంబంధాలు వున్నాయని, ఆ విషయాన్ని లైట్‌ తీసుకుని ఎక్కువ సీన్‌ చేయలేదని కాజల్‌ చెప్పింది. చోటా తనని ముద్దు పెట్టుకోగానే 'చాన్స్‌ పే డాన్స్‌' అంటే ఇదేనని కాజల్‌ అక్కడే చురక వేసింది. అయితే సినీ రంగంలో అనుభవజ్ఞురాలు కనుక దానిని ఇష్యూ చేయకుండా నవ్వుతూ దాటవేసింది. ఇదిలావుంటే కవచం చిత్రానికి ఇంటర్వ్యూలు ఇస్తానంటూ మీడియాని పిలిపించి కాజల్‌ వారిని రెండు గంటల పాటు వెయిట్‌ చేయించిందట.

దాంతో మీడియా వాళ్లకి ఒళ్లు మండి బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారట. ట్రాఫిక్‌పై నెపం నెట్టేసినా కానీ ముంబయి హీరోయిన్లకి తెలుగు మీడియా అంటే చులకన అయిపోతోందని, ఇలాంటివి పదే పదే రిపీట్‌ అవుతున్నాయని పీఆర్వోలపై బాగా ఫైర్‌ అయ్యారట. అయితే కొందరు మాత్రం కాజల్‌ వచ్చే వరకు ఆగి ఆమెతో మాట్లాడి, ఫోటోలు దిగి వచ్చారనుకోండి. అది వేరే సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English