నానితో మల్టీస్టారర్‌కి దిల్‌ రాజు మెగా ప్లాన్‌

నానితో మల్టీస్టారర్‌కి దిల్‌ రాజు మెగా ప్లాన్‌

నానితో నేను లోకల్‌ తీసినపుడే మరో రెండు సినిమాలకి అడ్వాన్సు ఇచ్చేసాడు దిల్‌ రాజు. ఆ ప్యాకేజీలో భాగంగా వెంటనే ఎంసిఏ సినిమా తీసాడు. నాని అతని కోసం మరో సినిమా చేయాల్సి వుంది. అందుకే 96 రీమేక్‌ నానితో చేద్దామని చూసాడు. అయితే నాని వేరే సినిమాలతో బిజీగా వుండి కుదరదనేసాడు. దీంతో దిల్‌ రాజు అతనికోసం మరో సినిమా సిద్ధం చేయిస్తున్నాడు.

నానిని హీరోని చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణకి 'సమ్మోహనం' తర్వాత దిల్‌ రాజు అడ్వాన్స్‌ ఇచ్చాడు. అతనిప్పుడో ఇద్దరు హీరోల కథ రాస్తున్నాడు. ఇందులో ఒక హీరోగా నానిని తీసుకుని మరో హీరోగా దుల్కర్‌ సల్మాన్‌ని తీసుకోవాలని దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నాడు. దుల్కర్‌కి మలయాళం, తమిళంలో కూడా పాపులారిటీ వుండడంతో అతడు హీరో అయితే ఈ చిత్రాన్ని దక్షిణాది అంతటా విడుదల చేయవచ్చునని దిల్‌ రాజు భావిస్తున్నాడు.

కానీ దుల్కర్‌ ఇప్పుడు వివిధ భాషల చిత్రాలతో చాలా బిజీ. నాని కూడా ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేడు. ఈ ఇద్దరినీ కలిపి సినిమా తీస్తే బాగానే వుంటుంది కానీ ఇద్దరి డేట్స్‌ ఒకేసారి దొరకడమనేది కాస్త కష్టమే మరి. దుల్కర్‌తో కూడా దిల్‌ రాజుకి మంచి సంబంధాలున్నాయి. అతనితో తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా తీయాలని దిల్‌ రాజు చాలా కాలంగా చూస్తున్నాడు. అన్నీ కుదిరితే అది ఈ సినిమాతో నెరవేరడానికి ఆస్కారముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English