బాయ్‌ఫ్రెండ్‌ పని చెడగొడుతున్న హీరోయిన్‌

బాయ్‌ఫ్రెండ్‌ పని చెడగొడుతున్న హీరోయిన్‌

నయనతార లాంటి హీరోయిన్‌ ప్రేమలో పడిందంటే ఇంకా అప్‌కమింగ్‌ అయిన దర్శకుడి పరిస్థితి ఎలా వుంటుంది? ప్రపంచాన్ని గెలిచేసిన ఫీలింగ్‌ వుండడం కామనే. తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇంతవరకు మూడంటే మూడు సినిమాలే తీసిన ఈ దర్శకుడు తదుపరి చిత్రం ఏమిటో కూడా ఇంకా ఆలోచించుకోలేదు.

ఒకవైపు నయనతార ఎడాపెడా సినిమాలు చేసేస్తూ వుంటే, విఘ్నేష్‌ మాత్రం ఆమె వెంట షూటింగులకి తిరుగుతున్నాడు. గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడి మోసపోయిన నయనతార ఈసారి బాయ్‌ఫ్రెండ్‌ని కొంగుకి కట్టేసుకుంది. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వుంటే అతను మరొకరి ప్రేమలో పడిపోతాడని కాబోలు విఘ్నేష్‌ని తన వెంటే తిప్పుకుంటోంది. 2015లో 'నానుమ్‌ రౌడీ థాన్‌' అనే చిత్రం షూటింగ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత విఘ్నేష్‌ ఒకే ఒక్క సినిమా తీసాడు. సూర్యతో 'గ్యాంగ్‌' సినిమా తీసిన తర్వాత మళ్లీ విఘ్నేష్‌ ఇంతవరకు ఇంకో సినిమా ఊసే ఎత్తలేదు.

టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అయినప్పటికీ తన పని మీద దృష్టి పెట్టకుండా నయనతార వెంట పడి తిరుగుతూ వుండడం పట్ల జోకులు పడుతున్నా అతడిని మాత్రం నయనతార విడిచి పెట్టడం లేదు. ఇద్దరూ పెళ్లి కూడా చేసేసుకున్నారని, నయనతార తన డిమాండ్‌ తగ్గకూడదని ఆ విషయం దాచి పెడుతోందని కూడా చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English