అల్లు అర్జున్‌ అని ఎగిరి, గోపీచంద్‌కి దిగారా?

అల్లు అర్జున్‌ అని ఎగిరి, గోపీచంద్‌కి దిగారా?

తమిళ చిత్రం 96ని తెలుగులో రీమేక్‌ చేయడం కోసం దిల్‌ రాజు సన్నాహాల్లో వున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో చేయడానికి తగ్గ హీరో దిల్‌ రాజుకి దొరకడం లేదు. కథ చాలా నచ్చడంతో అల్లు అర్జున్‌ చేద్దామని చూసాడు. తన ఇమేజ్‌కి సూట్‌ కాకపోయినా కానీ అందుకు అనుగుణంగా మార్పుచేర్పులు చేయగలరేమో అనుకున్నాడు. అయితే ఈ కథ బన్నీకి సూట్‌ అవదనే ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో అతను మనసు మార్చుకున్నాడు. నానితో రీమేక్‌ చేద్దామని దిల్‌ రాజు భావించినా కానీ నాని ఇప్పుడు రీమేక్స్‌ చేసేంత తీరిగ్గా లేడు.

దీంతో మిడిల్‌ ఏజ్‌ హీరో అయిన గోపీచంద్‌ ఎలా వుంటాడని దిల్‌ రాజు క్యాంప్‌ ఆలోచిస్తోందట. గోపిచంద్‌ కూడా తన మాస్‌ ఇమేజ్‌నుంచి బయట పడడానికి ఏదైనా క్లాస్‌ సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే మరీ ఇంత ప్రయోగాత్మక చిత్రాన్ని అతనిపై చూస్తారా అనేది పెద్ద డౌట్‌. విజయ్‌ సేతుపతి మాదిరిగా ఎలాంటి పాత్రనయినా మెప్పించే టాలెంట్‌, ఇమేజ్‌ వున్న యాక్టర్లు తెలుగులో లేరు. అందుకే అతని చిత్రాలని తెలుగులో రీమేక్‌ చేయడం కుదరడం లేదు. ఏ హీరో డేట్స్‌ అయినా సాధించగలిగే దిల్‌ రాజు అంతటోడికే ఆప్షన్లు దొరకడం లేదంటే విజయ్‌ సేతుపతి స్పెషాలిటీ ఏమిటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English