సందీప్‌ కిషన్‌ని తొక్కేస్తోంది

సందీప్‌ కిషన్‌ని తొక్కేస్తోంది

స్టార్‌ ఇమేజ్‌ వున్న హీరోయిన్‌తో కలిసి సినిమా చేస్తే, అందులోను ఆ టైమ్‌లో సదరు హీరో ఫ్లాపుల్లో వుంటే... ఇక ఆ సినిమాని హీరోయిన్‌ హైజాక్‌ చేసేస్తుంది. 'నెక్స్‌ట్‌ ఏంటి' సినిమా విషయంలో అదే జరుగుతోంది. సందీప్‌ కిషన్‌ హీరో అయినా కానీ ఇది హీరోయిన్‌ ప్రధాన సినిమాగా ప్రచారమవుతోంది. నిజానికి హీరో హీరోయిన్లు ఇద్దరివీ సమానమైన పాత్రలే అయినా కానీ తన పాత్ర కాస్త ఎక్కువ సమానం అని తమన్నా స్వయంగా ప్రకటించింది. అంతే కాకుండా ఆమె నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్‌ సినిమా 'దటీజ్‌ మహాలక్ష్మి'తో దీనిని కూడా కలిపి చెప్పేస్తోంది.

రెండు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ఒకేసారి నటించాననే అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. సందీప్‌ కిషన్‌ వరుస ఫ్లాపుల్లో వుండడంతో 'బాహుబలి' హీరోయిన్‌ అని చెప్పి మీడియా తమన్నాకి 'నెక్స్‌ట్‌ ఏంటి' విషయంలో ఇంకాస్త ఎక్కువ వెయిట్‌ ఇస్తోంది. ఇదే అదనుగా తమన్నా కూడా పూర్తిగా హైలైట్‌ అయిపోవాలని చూస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌కి అనుగుణంగా సెక్స్‌, అఫైర్స్‌ లాంటి టాపిక్స్‌తో యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగిన ఈ చిత్రం మరో మూడు, నాలుగు చిత్రాలతో కలిసి విడుదలవుతోంది. ఎంత హాట్‌ కంటెంట్‌ని ట్రెయిలర్స్‌లో నింపినా కానీ బాగుందనే టాక్‌ వస్తే తప్ప పనయ్యేలా లేదనుకోండి. ఈలోగా ఈ సినిమా తమన్నా మూవీగా చలామణీ అయిపోకుండా సందీప్‌ కిషన్‌ రంగంలోకి దిగి తన ఉనికి నిలబెట్టుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English