ఎన్టీఆర్‌ సినిమాని పులిహోర చేసేసారు

ఎన్టీఆర్‌ సినిమాని పులిహోర చేసేసారు

బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టికి తెలుగు, తమిళ మాస్‌ డైరెక్టర్ల కంటే మసాలా పిచ్చి. సౌత్‌ సినిమాలని హిందీలో రీమేక్‌ చేసి కెరియర్‌ నిలబెట్టుకున్న ఈ దర్శకుడు తాజాగా 'టెంపర్‌' చిత్రాన్ని హిందీలోకి తర్జుమా చేస్తున్నాడు. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్‌ ఎన్టీఆర్‌ నటన వల్ల గుర్తుండిపోయింది. పూరి జగన్నాథ్‌ మార్కు డైలాగులకి తోడు, హత్తుకునే క్లయిమాక్స్‌ ఆ చిత్రాన్ని గుర్తుండిపోయేలా చేసింది. ఆ చిత్రాన్ని రీమేక్‌ చేస్తూ రోహిత్‌ శెట్టి మరో ఫ్రాంఛైజీ అయిన 'సింగం'కి జత కలిపాడు. సింగం సూర్య సినిమాకి రీమేక్‌ కాగా దానికి సీక్వెల్‌ని రోహిత్‌ మరో కథతో తీసాడు.

ఇప్పుడు టెంపర్‌ రీమేక్‌కి, దానికి లింక్‌ పెట్టి టైటిల్‌ కూడా 'సింబా' అని పెట్టాడు. రణ్‌వీర్‌ సింగ్‌ ఫిట్‌గా వున్నా కానీ ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ఆ పాత్రలో అతడిని చూడడం తెలుగువాళ్లకి అయితే కష్టంగానే వుంటుంది. నార్త్‌ ప్రేక్షకులు కూడా ట్రెయిలర్‌ని కామెడీ చేయడం చూస్తోంటే రోహిత్‌ శెట్టి ఈ చిత్రం సోల్‌ని పట్టలేకపోయాడనిపిస్తుంది. టెంపర్‌ ట్రెయిలర్‌ నిండా పంచ్‌ డైలాగులకి తోడు హీరో క్యారెక్టరైజేషన్‌ బాగా హైలైట్‌ అవుతుంది. ఇక్కడ సింగంతో లింక్‌ పెట్టడానికే సరిపోయింది.

చివరకు సింగంలోని అజయ్‌ దేవ్‌గన్‌ పాత్రని కూడా ట్రెయిలర్‌లో ఇంట్రడ్యూస్‌ చేసారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ పరిచయం అవుతోంది. డిసెంబర్‌ 28న రిలీజ్‌ అయ్యే సింబా రణ్‌వీర్‌కి సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలు కాకుండా మిగతా వాటిని నడిపించే సత్తా వుందా లేదా అనేది తేల్చేస్తుంది


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English