నాని కోసం ఆ లెజెండ్ వచ్చాడు

నాని కోసం ఆ లెజెండ్ వచ్చాడు

ఎన్ని సినిమాల అనుభవమున్నా.. ఎన్ని హిట్లు కొట్టినా..కొందరు లెజెండరీ టెక్నీషియన్లతో పని చేయడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు హీరోలు. అలాంటి దిగ్గజాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఒకరు. ‘నాయకన్’తో మొదలుపెడితే శ్రీరామ్ అద్భుత ఛాయాగ్రహణ ప్రతిభకు తార్కాణంగా నిలిచే సినిమాలు ఎన్నెన్నో. ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా కూడా ఒప్పుకోరు. దర్శకుల అభిరుచిని బట్టి సినిమాను ఓకే చేస్తారు. తాజాగా ఆయన విక్రమ్ కె.కుమార్ కొత్త సినిమాకు పని చేయబోతుండటం విశేషం. ఇంతకుముందు విక్రమ్ కుమార్‌తో కలిసి ‘13 బి’, ‘ఇష్క్’ సినిమాలకు వర్క్ చేసిన శ్రీరామ్.. వాటిలో తన మార్కు చూపించాడు.

ముఖ్యంగా ‘ఇష్క్’కు శ్రీరామ్ కెమెరా పనితనం పెద్ద ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మరోసారి విక్రమ్ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. ఇది నానికి ఎంత సంతోషాన్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’లో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పిన నాని.. ఆ చిత్రంలో శ్రీరామ్ పనితనం గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడు అంత పెద్ద సినిమాటోగ్రాఫర్ తన సినిమాకు పనిచేస్తుండటం నాని అమితానందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. విక్రమ్‌తో తాను కలిసి ఉన్న ఒక ఆసక్తికర ఫొటోను షేర్ చేస్తూ ఈ సినిమా గురించి ఆదివారం వెల్లడించాడు నాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English