నానికి లాభసాటి వ్యాపారం

 నానికి లాభసాటి వ్యాపారం

నానికి ఇప్పుడు ఎటు లేదన్నా ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. ఎందుకంటే నానితో తీసే సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టాలనే రూల్‌ వుండదు. థియేటర్స్‌ నుంచి వచ్చేది, ఇతర హక్కులు కలుపుకుంటే అతని సినిమాలు యాభై కోట్లు పలుకుతాయి. అందుకే నానికి పది కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచించడం లేదు.

అయితే ఇలా పారితోషికం అంటూ తీసుకుంటే ప్రతి సినిమాకీ హెచ్చు తగ్గులు వస్తుంటాయని నాని కొత్త పథకం రచించాడు. తన సినిమాలకి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో యాభై శాతం వాటా అడుగుతున్నాడు. జెర్సీ చిత్రానికి అదే చేసిన నాని తాజాగా మైత్రి మూవీస్‌తో కూడా సేమ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాడట. అంటే పారితోషికం లేకుండా నానితో తీసే సినిమా ఇరవై కోట్ల లోపులో ముగించగలిగితే, పైన చెప్పుకున్న లెక్క ప్రకారం ముప్పయ్‌ కోట్ల లాభం వస్తుంది.

అందులో యాభై శాతం అంటే నాని చేతికి పదిహేను కోట్లు వస్తుంది. పారితోషికం ఇంత అడిగితే నిర్మాతలు బెంబేలు పడతారు కానీ లాభంలో వాటా అంటే వాళ్లు కాదనేది ఏముంది? తన మార్కెట్‌ని సరిగ్గా స్టడీ చేసి పర్‌ఫెక్ట్‌గా క్యాష్‌ చేసుకుంటున్నాడని నానిని అభినందిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English