అభిమానుల వైపే నిలబడ్డ తారక్‌

అభిమానుల వైపే నిలబడ్డ తారక్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌కి పితృవియోగం తర్వాత మళ్లీ దగ్గరయిన చంద్రబాబు, బాలకృష్ణ ఈసారి ఎన్నికలకి ఎన్టీఆర్‌ని వాడాలనే చూస్తున్నారు. కుకట్‌పల్లి నియోజికవర్గం నుంచి ఎన్టీఆర్‌ సోదరి సుహాసినిని నిలబెట్టడంతోనే హరికృష్ణ సెంటిమెంటుని  ఉపయోగించుకోవాలనే ప్రయత్నం ప్రస్ఫుటమైంది.

అయితే ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్టీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదని, సోదరి అయినప్పటికీ ఆమె తరఫున ప్రచారం చేయరాదని ఫాన్స్‌ బలంగా కోరుకున్నారు. ఒక టైమ్‌లో ఎన్టీఆర్‌ని ఒంటరివాడిని చేసి, అతని సినిమాలు నిషేధించాలంటూ ఎస్‌ఎంఎస్‌ క్యాంపైన్‌ టీడీపీ ముసుగులో జరిగిన సంగతి ఫాన్స్‌ ఇంకా మరచిపోలేదు.

తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు ఎన్టీఆర్‌ పాత విషయాలని వదిలేసి మామూలుగా కలిసినా కానీ రాజకీయ పరంగా పూర్తిగా యాక్టివ్‌ అయి వాళ్లు చేసినది పూర్తిగా విస్మరిస్తాడేమోనని ఫాన్స్‌ ఆందోళన చెందారు. అయితే ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా వుండడం వల్ల అయితేనేమి, మరో కారణం వల్ల అయితేనేమి ప్రచారం వైపు వెళ్లకపోవడంతో ఫాన్స్‌ ఆనందంగా వున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో కూడా ఎన్టీఆర్‌ ఇలాగే వ్యవహరిస్తాడని, ఫాన్స్‌ మనోభావాలకే ఎక్కువ విలువ ఇస్తాడని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English