‘బాహుబలి-2’ని కాదు.. ‘బాహుబలి-1’ను టచ్ చేసింది

‘బాహుబలి-2’ని కాదు.. ‘బాహుబలి-1’ను టచ్ చేసింది

‘2.0’ మొదలైనప్పటి నుంచి ‘బాహుబలి’తో దానికి పోలిక వస్తోంది. ‘బాహుబలి’ రికార్డులు బద్దలు కొట్టగల సత్తా దీనికి మాత్రమే ఉందని అంచనా వేశారు. కానీ రిలీజ్ దగ్గర పడే సమయానికి అంచనాలు మారిపోయాయి. దీని టీజర్, ట్రైలర్ సినిమాపై అంతకుముందున్న అంచనాల్ని తగ్గించేశాయి. ఇక విడుదల తర్వాత అయితే ‘ది కంక్లూజన్’తో పోలికే లేకుండా పోయింది.

అసలు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా.. భారీగా పెట్టుబడులు పెట్టిన బయ్యర్లను బయట పడేస్తుందా అన్న చర్చ మొదలైంది. రిలీజైన రెండో రోజు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘2.0’ శనివారం బాగా పుంజుకుంది. ఇండియాలోనే కాక.. అమెరికాలో సైతం ఈ చిత్రానికి శనివారం మంచి వసూళ్లు వచ్చాయి.

ముఖ్యంగా యుఎస్‌లో తొలి రెండు రోజుల వసూళ్లు చూసి బయ్యర్లు షాకయ్యారు. మూడు భాషల్లో కలిపి బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే 7 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సిన ఆ చిత్రం తొలి రెండు రోజుల్లో 1.5 మిలియన్ మార్కును మాత్రమే దాటింది. ఐతే శనివారం ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కాయి. 1.25 మిలియన్ డాలర్ల దాకా ఈ ఒక్కరోజే వసూలయ్యాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ తొలి శనివారం ఏకంగా 3.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయడం విశేషం.

ఇది కనీ వినీ ఎరుగని రికార్డు. సమీప భవిష్యత్తులో ఈ రికార్డును మరే సినిమా టచ్ చేసే అవకాశం కనిపించడం లేదు. యుఎస్‌లో ఆ సినిమా దరిదాపులకు కూడా వెళ్లలేదు ‘2.0’. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’ను మాత్రం టచ్ చేసింది. తొలి శనివారం అక్కడ ఈ చిత్రం 1.3 మిలియన్ డాలర్లే వసూలు చేసింది. యుఎస్‌లోనే కాక మిగతా చోట్ల కూడా ‘2.0’ బ్రేక్ ఈవెన్ సాధిస్తే.. ‘బాహుబలి: ది బిగినింగ్’ రికార్డుల్ని మాత్రం దాటుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English