2.0 పడిపోలేదు.. బయ్యర్లు హ్యాపీ

2.0 పడిపోలేదు.. బయ్యర్లు హ్యాపీ

మరీ బాహుబలి 2తో సమానంగా వసూళ్లు వచ్చేస్తాయని అంచనాలు వేయడం వల్ల 2.0కి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చినా కానీ నిరాశ వ్యక్తమయింది. బాహుబలి 2ని బెంచ్‌మార్క్‌గా పెట్టి ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లని తీసి పారేసారు. సినిమాపై పెట్టిన బడ్జెట్‌ వల్ల అంత భారీ అంచనాలు వుండడం సాధారణమే కానీ బాహుబలి 2కి ముందు వున్న హైప్‌ దీనికి లేదనేది అంగీకరించాలి.

మొదటి రోజు వసూళ్లు చూసి బయ్యర్లు వణికిపోయారు కానీ రెండవ రోజు 2.0 సాలిడ్‌గానే నిలబడింది. భారీ డ్రాప్‌ లేకపోవడంతో బయ్యర్లు కుదుట పడ్డారు. ముఖ్యంగా హిందీలో మొదటి రోజుకీ రెండవ రోజుకీ నెట్‌ వసూళ్లలో కేవలం రెండు కోట్లు మాత్రమే డిఫరెన్స్‌ రావడాన్ని బట్టి పబ్లిక్‌ టాక్‌ ఏమిటనేది క్లియర్‌ అయింది. తెలుగు, తమిళంలో కూడా త్రీడీ థియేటర్లలో టికెట్లు దొరకడం లేదు. ఎలాగైనా త్రీడీలోనే చూడాలని జనం ఫిక్స్‌ అవడం వల్ల టూడీ వసూళ్లు ఆశాజనకంగా లేవు. మరోవైపు యుఎస్‌లో మొదటి రోజు షాకింగ్‌ వసూళ్లు తెచ్చుకున్న 2.0 శుక్రవారం చాలా బాగా పర్‌ఫార్మ్‌ చేసింది. దాదాపు ఏడు లక్షల డాలర్లు శుక్రవారం వసూలు చేయడంతో శనివారం మిలియన్‌కి పైగానే వస్తాయని అంచనాలున్నాయి.

రాంగ్‌ సీజన్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి ఈ వీకెండ్‌ చాలా కీలకం. ఫ్యామిలీస్‌, కిడ్స్‌ ఎంత ఇదిగా దీని కోసం చూస్తున్నారనేది ఈ వీకెండ్‌తో తేలిపోతుంది. దాని వల్ల లాంగ్‌ రన్‌ వుంటుందా లేదా అనేదానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి డెబ్బయ్‌ అయిదు కోట్లు వసూలవ్వాలట. భారీ టార్గెట్టే కానీ ప్రస్తుతానికి మరీ బెంగ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు మరి. వచ్చే వారం చాలా చిత్రాలు విడుదల కానున్నా కానీ 2.0ని ఛాలెంజ్‌ చేసే భారీ చిత్రాలేవీ వచ్చే మూడు వారాల వరకు లేకపోవడం శుభ పరిణామం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English