మహేష్‌కి వాళ్ళంటే మహా ఇది

మహేష్‌కి వాళ్ళంటే మహా ఇది

మహేష్‌ బాబు ఎక్కువగా తమిళ దర్శకులతో పని చేయనప్పటికీ తమిళ దర్శకులని మాత్రం బాగా ఇష్టపడుతుంటాడు. పలుమార్లు మణిరత్నం, శంకర్‌తో నటించే అవకాశం వచ్చినా కానీ ఎందుకో కుదర్లేదు. మురుగదాస్‌తో ఏరి కోరి చేసిన బైలింగ్వల్‌ 'స్పైడర్‌' ఫ్లాప్‌ అవడమే కాకుండా తమిళ కమెడియన్లకి మహేష్‌పై జోక్స్‌ వేసే అవకాశం కల్పించింది.

అయినప్పటికీ మురుగదాస్‌ మొన్న తీసిన 'సర్కార్‌'పై మహేష్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 2.0కి కూడా తెలుగు సూపర్‌స్టార్స్‌లో ముందుగా మహేష్‌నుంచే అభినందనలు దక్కాయి. నవాబ్‌ వచ్చినపుడు మణిరత్నంపై తనకి వున్న అభిమానాన్ని చిన్నపిల్లాడిలా చాటుకున్నాడు మహేష్‌. తెలుగులో వచ్చే అన్ని ముఖ్య చిత్రాలకీ మహేష్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడు. ఉదాహరణకి తనకి మంచి స్నేహితులైన ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలిసి చేసిన అరవింద సమేత గురించి మహేష్‌ అసలు తన కామెంట్సే పెట్టలేదు.

తెలుగు చిత్రాల విషయంలో కాస్త లేట్‌గా వున్నా తమిళ చిత్రాలకి మాత్రం విధిగా ఫీడ్‌బ్యాక్‌ ఇస్తోన్న మహేష్‌పై ఇతర తెలుగు హీరోల అభిమానులు గుర్రుగా వున్నారు. తన మాట వల్ల ఒక సినిమాకి బెనిఫిట్‌ అవుతుందని తెలిసినపుడు అన్ని ప్రధాన తెలుగు చిత్రాల గురించి ట్వీట్‌ చేయవచ్చుగా అని వారు అడుగుతున్నారు. ఒకవేళ స్పందించడం ఇష్టం లేకపోతే దేని గురించీ మాట్లాడకూడదని, అంతే తప్ప ఇలా సెలక్టివ్‌ ఫేవరిజమ్‌ చూపిస్తే తనకి ఫలానా సినిమా నచ్చలేదని అనుకుంటారనేది వారి కంప్లయింటు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English