ఆర్ఆర్ఆర్.. ఒక సిల్లీ రూమర్

ఆర్ఆర్ఆర్.. ఒక సిల్లీ రూమర్

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తీస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మామూలు ఆసక్తి లేదు. పైగా ఈసారి ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో మెగా మల్టీస్టారర్ చేస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రం గత నెలలోనే ప్రారంభోత్సవం జరుపుకుని.. రెగ్యులర్ షూటింగ్‌ కూడా మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్లోనే తారక్-చరణ్‌ల మీద భారీ యాక్షన్ సీక్వెన్స్ తీశాడు జక్కన్న. తాజాగా రామ్ చరణ్ తన పార్ట్ వరకు షూటింగ్ పూర్తి చేసి రిలీవ్ అయిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ మీద చిత్రీకరణ కొనసాగుతోంది. ఇంకో వారం రోజులు షూటింగ్ కొనసాగుతుందట. అంతటితో తొలి షెడ్యూల్‌కు బ్రేక్ పడుతుంది. కొంచెం విరామం తీసుకుని రెండో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.

ఓవైపు ఇక్కడ షూటింగ్ నడుస్తుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు.. విలన్ పాత్రధారుల గురించి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కీర్తి సురేష్.. రాశి ఖన్నా.. రష్మిక మంధాన... పూజా హెగ్డే.. ఇలా రకరకాల పేర్ల చుట్టూ డిస్కషన్లు నడుస్తున్నాయి. ఐతే వీళ్లందరూ కూడా మాంచి ఊపుమీదున్న హీరోయిన్లే కాబట్టి వీళ్ల గురించి చర్చలు సాగడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పడు తాజాగా ప్రియమణి పేరు తెరమీదికి రావడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

గతంలో రాజమౌళి తీసిన ‘యమదొంగ’ సినిమాలో ప్రియమణినే కథానాయికగా నటించింది. అప్పటికి ఆమె మాంచి ఊపుమీదుండేది. కానీ ఇప్పుడు ప్రియమణి పరిస్థితేంటో కొత్తగా చెప్పాలా? ఐదేళ్ల కిందటే తెలుగులో ఆమె కెరీర్ ముగిసింది. ఇప్పుడు వేరే భాషల్లో కూడా ఆమెకు అవకాశాలు లేవు. పూర్తిగా షేపవుట్ అయిపోయిన ప్రియమణిని ‘ఆర్ఆర్ఆర్’ కోసం తీసుకుంటారంటే నమ్మేదెలా? కాకపోతే కథానాయికగా కాకుండా ఏదైనా ప్రత్యేక పాత్రకు ప్రియమణిని కన్సిడర్ చేస్తే చేయొచ్చేమో కానీ.. అందుకు కూడా చాలానే ఆప్షన్లు ఉన్నాయి. మరి ఈ రూమర్లో నిజం ఎంతోచూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English