2.0 రికార్డ్ మిస్.. విజ‌య్ ఫ్యాన్స్ ఖుషీ

2.0 రికార్డ్ మిస్.. విజ‌య్ ఫ్యాన్స్ ఖుషీ

ఒక స్టార్ హీరో వ‌సూళ్ల రికార్డులు బ‌ద్ద‌లు కొడితే అత‌డి అభిమానులు ఎంత సంతోషిస్తారో.. ఆ హీరోకు పోటీగా ఉన్న మ‌రో స్టార్ హీరో అభిమానులు అంత‌గా నిరాశ చెందుతారు. ఐతే ద‌క్షిణాదిన కొన్ని ద‌శాబ్దాలుగా ఎవ్వ‌రూ పోటీగా భావించ‌ని హీరో ఎవ‌రైనా ఉన్నారంటే అది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంతే. ఆయ‌న‌తో ఎవ్వ‌రూ పోల్చుకోరు. ఆయ‌నతో పోటీకి దిగ‌రు. ఆయ‌న సినిమాల రికార్డుల జోలికి వెళ్ల‌రు. ర‌జ‌నీ ఫాలోయింగ్ వేరు. ఆయ‌న మార్కెట్ వేరు. ఐతే ఈ మ‌ధ్య ప‌రిస్థితి మారుతోంది. త‌మిళ స్టార్ హీరో విజ‌య్.. ర‌జ‌నీకి ద‌గ్గ‌ర‌గా వ‌స్తున్నాడు. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో త‌న ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకున్న విజ‌య్.. ఈ మ‌ధ్య ర‌జ‌నీ రికార్డుల‌నూ అందుకుంటున్నాడు. దీపావ‌ళికి విడుద‌లైన అత‌డి కొత్త సినిమా ‘స‌ర్కార్ ర‌జ‌నీ పాత రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టేసింది.

ఐతే సూప‌ర్ స్టార్ కొత్త సినిమా ‘2.0’ మీద ఉన్న అంచ‌నాల దృష్ట్యా దానికి ఈ  రికార్డులు ఓ లెక్కా అనుకున్నారు. అన్ని రికార్డులూ చెరిపేసి కొత్త చ‌రిత్ర‌కు ర‌జ‌నీ శ్రీకారం చుడుతాడ‌ని అంచ‌నా వేశారు. కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ‘2.0’ త‌మిళ‌నాట చెన్నైతో పాటు కొన్ని ఏరియాల్లో మాత్ర‌మే రికార్డు నెల‌కొల్పింది. ఓవ‌రాల్ త‌మిళ‌నాడు ఓపెనింగ్ రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయింది. ‘స‌ర్కార్’ రికార్డులే కంటిన్యూ అవుతున్నాయి. వీకెండ్ వ‌సూళ్ల సంగ‌తేంటో తేఆల్సి ఉంది. దీపావ‌ళికి రిలీజ్ కావ‌డం విజ‌య్ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్లు అందుకుంది స‌ర్కార్. ర‌జ‌నీ సైతం విజ‌య్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోవ‌డంతో ద‌ళ‌ప‌తి అభిమానుల ఆనందం మామూలుగా లేదు. ర‌జ‌నీ ఎలాగూ సినిమాలు మానేసి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్న నేప‌థ్యంలో ఇక ఆయ‌న స్థానం విజ‌య్‌దే అంటూ పొంగిపోతున్నారు అత‌డి ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English