మహర్షికి ఈగోల గోల

మహర్షికి ఈగోల గోల

మహేష్‌బాబు ఇరవై అయిదవ చిత్రానికి ఏకంగా ముగ్గురు నిర్మాతలయ్యారు. దిల్‌ రాజుకి చేయాల్సిన ఈ చిత్రానికి అశ్వనీదత్‌ని కూడా జత చేసాడు మహేష్‌. తన తొలి చిత్రం నిర్మించిన నిర్మాతని ఇరవై అయిదవ చిత్రంలోను భాగస్వామిని చేయాలని భావించి దత్‌కి కూడా పార్టనర్‌షిప్‌ ఇచ్చాడు. ఇంతలో తనకి కమిట్‌ అయిన వంశీ పైడిపల్లి బయటి వారికి ఎలా సినిమా చేస్తాడంటూ పివిపి కేసు పెట్టాడు. దాంతో ఆయనకి కూడా సమాన వాటా ఇచ్చి ఈ చిత్రంలో భాగస్వామిని చేసారు. ఇంతవరకు బాగానే వుంది కానీ ముగ్గురు నిర్మాతలయ్యే సరికి ఈగోల సమస్య వస్తోందట.

ఎవరు ఈ చిత్రానికి కెప్టెన్‌ అనే దానిపై ఎవరికి వారు పోటీ పడుతున్నారట. దిల్‌ రాజు ఈ చిత్రం నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ మంచి డీల్స్‌ ఏమైనా వస్తే క్లోజ్‌ చేయాలని చూస్తున్నాడట. అయితే అతని ఆధిపత్యం ఎక్కువ అవుతోందని, తమ మాట కూడా చెల్లాలని మిగతా నిర్మాతలు ఏ డీల్‌ని క్లోజ్‌ అవ్వనివ్వడం లేదట. రిలీజ్‌ వరకు వేచి చూసినట్టయితే ముందు వచ్చిన ఆఫర్లు ఏవో కారణాల వల్ల తర్వాత రాకపోవచ్చునని, ప్రస్తుత ట్రెండ్‌ తెలిసిన దిల్‌ రాజు నచ్చచెప్పాలని చూసినా వారిద్దరూ వినడం లేదట. నిర్మాతల ఈగో క్లాష్‌లు ఇలా వుంటే బడ్జెట్‌ కూడా అదుపు తప్పిందని, అందుకే మంచి డీల్‌ వచ్చినపుడు క్లోజ్‌ చేయడం మంచిదనేది ఇండస్ట్రీ మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English