బన్నీ మాత్రం కేక అంట

బన్నీ మాత్రం కేక అంట

 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్‌ చిన్న క్యారెక్టర్‌ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్‌ సినిమాలో పావుగంట పాటు ఉంటుందట. కథలో ఇది చాలా కీలకమైన పాత్ర అని, మొత్త సినిమా ప్లాట్‌ దీని మీదే ఆధారపడి ఉంటుందని తెలిసింది. ఈ క్యారెక్టర్‌ కనిపించేది కాసేపు అయినా కానీ గుర్తుండిపోయేలా దర్శకుడు పైడిపల్లి వంశీ తీర్చిదిద్దాడట.

 అల్లు అర్జున్‌లాంటి స్టార్‌ హీరో గెస్ట్‌ రోల్‌ చేయడం చాలా అరుదు. అందుకే ఆ అరుదైన పాత్ర స్టాంప్‌ పడిపోయేలా తెరకెక్కించారట. అల్లు అర్జున్‌ సన్నిహితులు 'ఇద్దరమ్మాయిలతో' కంటే 'ఎవడు' కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారంటే ఈ క్యారెక్టర్‌ ఎంత స్పెషల్‌ అనేది అర్థం చేసుకోవచ్చు. చరణ్‌ కూడా అల్లు అర్జున్‌ చేసిన క్యారెక్టర్‌ని లైక్‌ చేశాడట.

ఒక వేళ ఈ సినిమా అల్లు అర్జున్‌తో తీసి, తనకి ఈ పాత్ర ఆఫర్‌ చేసినా కానీ చేసి ఉండేవాడినని దర్శకుడితో అన్నాడట. ఈ మెగా హీరోలిద్దరి కాంబినేషన్‌ తెరపై ఒకేసారి కనిపించదు కానీ ఇద్దరు మెగా హీరోలున్న సినిమా అంటే ఫాన్స్‌ డబుల్‌ ఫెస్టివలే కదా!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు