ఇలాగైతే బ్రేక్ ఈవెన్ ఎలాగబ్బా?

ఇలాగైతే బ్రేక్ ఈవెన్ ఎలాగబ్బా?

భారీ అంచనాల మధ్య గురువారం రిలీజైన ‘2.0’ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా స్కేల్ ప్రకారం చూస్తే వసూళ్లు కూడా అంచనాలకు తగ్గట్లు లేవు. ఫుల్ రన్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ దరిదాపుల్లోకి కూడా ఈ చిత్రం వెళ్లే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బ్రేకింగ్ ఆల్ రికార్డ్స్ అంటూ నిన్న ‘లైకా ప్రొడక్షన్స్’ వేసిన పోస్టర్లు నిజం కాదన్నది స్పష్టం. కనీసం తమిళనాడులో కూడా ఈ చిత్రం డే-1 రికార్డుల్ని బద్దలు కొట్టలేకపోయింది.

ఇక తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే.. ‘2.0’ తొలి రోజు రూ.12.5 కోట్లు వసూలు చేసింది. రజనీ తెలుగు డబ్బింగ్ సినిమాల్లో ఇది రికార్డే. కానీ ఈ చిత్రం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. ఏకంగా రూ.72 కోట్లు పెట్టి తెలుగు హక్కులు కొన్నారు. దిల్ రాజు.. ఎన్వీ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాతలు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా సినిమాను రిలీజ్ చేశారు. మెజారిటీ థియేటర్లు దీనికే కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలుగు స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ‘2.0’ తొలి రోజు ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు ఫలించలేదు.

తొలి రోజు రూ.12.5 కోట్లు వచ్చాయంటే.. తర్వాతి రోజు రూ.10 కోట్ల మార్కును కూడా టచ్ చేయడం కష్టమే. వీకెండ్లోపు రూ.30-35 కోట్ల మధ్య షేర్ రావొచ్చేమో. వీకెండ్ తర్వాత ఆటోమేటిగ్గా వసూళ్లు మరింత తగ్గుతాయి. మరి రూ.70 కోట్ల మార్కును ఈ చిత్రం అందుకుంటుందా అన్నది డౌట్. పైగా వచ్చేవారం సినిమాలు చాలానే రిలీజవుతున్నాయి. ‘2.0’కు ఎంత లాంగ్ రన్ ఉంటుందన్నది చూడాలి. పైగా ఈ చిత్రాన్ని జనాలు 3డీ థియేటర్లలో చూడటానికే ప్రిఫర్ చేస్తున్నారు. మిగతా 80 శాతానికి పైగా ఉన్న రెగ్యులర్ థియేటర్లలో ఇప్పుడే వసూళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ‘2.0’ బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఆగిపోతుందేమో అని సందేహాలు కలుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English